అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..!

ప్రముఖ గీత రచయిత కుల శేఖర్ జీవితం ఎంతో విషాదకరంగా ముగిసింది. అనాథలా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న మరణించారు. ఓ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు.

New Update

Kula Shekar: అమ్మో అమ్మాయేనా.. నన్నే నన్నే చూస్తూ.ఏ చిలిపి,  'మస్తు.. మస్తు సంగతుంది నీలో పోరి' 'మావోయ్ మావోయ్' గాలి చిరుగాలి, ఓ జాబిలీ, నడుమే ఉయ్యాలా నడకే జంపాలా, చెలియా.. చెలియా ఇలా ఒకటి కాదు రెండు కాదు 100 పైగా సినిమాల్లో ఎన్నో మెలోడీస్ కుల శేఖర్ కలం నుంచి జాలువారాయి. చిరకాలం ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయే పాటలు అందించారు. సాహిత్యం పై ఆసక్తితో దిగ్గజ దర్శకుడు కే. విశ్వనాథ్ దగ్గర మెళకువలు నేర్చుకున్నారు. డైరెక్టర్ తేజ, ఆర్ఫీ పట్నాయక్ కాంబోలో రిలీజైన ఎన్నో విజయవంతమైన చిత్రాలకు అనేక పాటలు అందించి.. గీత రచయితగా సత్తా చాటారు. 

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఒక్క సినిమా అతడి జీవితాన్ని చీకటిమయం చేసింది!

అనాథలా మరణించిన కుల శేఖర్ 

ఎన్నో మధురమైన పాటలకు తన మాటలతో జీవం పోసిన కుల శేఖర్ చివరికి ఒక అనాథలా మరణించాడు.  మతిస్థిమితం కోల్పోయి.. ఎంతో విషాదకరంగా ఆయన జీవితంముగిసింది. దిక్కులేనివాడిలా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచారు. అంత హైట్స్ చూసిన ఆయన.. చివరికి ఘోరమైన పరిస్థితిలో మరణించారు. మతిస్థిమితం లేక ఓ రోడ్డు పక్కన గాయాలతో పడిన ఆయనను ఎవరో గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.  హాస్పిటల్ లో ఓ నర్సు ఆయనను గుర్తుపట్టడంతో కుల శేఖర్ మరణించారనే  విషయం తెలిసిందే. లేదంటే ఆయన ఆచూకీ కనుక్కునే వారు కూడా లేకపోయేవారమో. 

 గీత రచయిత నుంచి దర్శకుడిగా మారిన ఆయన తొలిసారి  'ప్రేమలేఖ రాశా’(2007) అనే సినిమాను తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా విడుదల చాలా ఆలస్యం కావడం ఆయనను మానసికంగా ఎంతో కృంగతీసిందని చెబుతుంటారు.  ఆ తర్వాత 2008 లో అతను మెదడుకు సంబంధించిన వ్యాధి బారిన పడి జ్ఞాపకశక్తిని కోల్పోయాడని అతని స్నేహితులు తెలిపారు. అప్పులు కావడంతో  కుటుంబ సభ్యులు కూడా  ఎవరూ ఆయనను పట్టించుకోలేదట. అలా జీవితంలో ఒంటరైన ఆయన మానసిక స్థితి కోల్పోయినట్లు చెబుతారు. 

Also Read: అమ్మో అమ్మాయేనా.. నన్నే నన్నే చూస్తూ.. కులశేఖర్ కలం నుంచి వచ్చిన హిట్స్ లిస్ట్ ఇదే!

Advertisment
తాజా కథనాలు