ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది? గేయ రచయితగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కులశేఖర్ జీవితాన్ని ఒక్క సినిమా పాడుచేసింది. 2007లో దర్శకుడిగా మారిన ఆయన 'ప్రేమలేఖ రాశా' చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఆ సినిమా విడుదల చాలా ఆలస్యం కావడంతో మానసికంగా కృంగిపోయరు కులశేకర్. ఆ తర్వాత మతిస్థిమితం కోల్పోయారు. By Archana 27 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Kula Shekar: 'చిత్రం' సినిమాతో లిరిక్ రైటర్ గా కెరీర్ మొదలు పెట్టిన కుల శేఖర్.. 100కు పైగా సినిమాలకు పాటలు రాశారు. కెరీర్ ప్రారంభంలో దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి దగ్గర శిష్యరికం చేస్తూ సినీ గీతాల రచనలో మెలకువలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్ దగ్గర కాంబోలో వచ్చిన అనేక విజయవంతమైన చిత్రాలకు పాటలు రాశారు. చిత్రం, జయం, రామ్మా!చిలకమ్మా, ఘర్షణ, వసంతం, నువ్వు నేను, ఔనన్నా కాదన్నా, మృగరాజు, సుబ్బు వంటి సినిమాల్లో ఎన్నో సూపర్ పాటలు అయన కలం నుంచి జాలువారాయి. Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్ వైరల్! ఒక్క సినిమాతో.. మానసికంగా కృంగిపోయిన కుల శేఖర్ కానీ.. గీత రచయితగా కెరీర్ పీక్స్ ఉన్న ఆయన జీవితాన్ని ఒక్క సినిమా చీకటిమయం చేసింది. గీత రచయిత నుంచి దర్శకుడిగా మారిన ఆయన తొలిసారి 'ప్రేమలేఖ రాశా’(2007) అనే సినిమాను తెరకెక్కించాడు. కానీ ఆ సినిమా విడుదల చాలా ఆలస్యం కావడం ఆయనను మానసికంగా ఎంతో కృంగతీసిందని సన్నిహితులు చెబుతుంటారు. ఆ తర్వాత అప్పులు కావడంతో కుటుంబ సభ్యులు కూడా ఎవరూ ఆయనను పట్టించుకోలేదట. అలా జీవితంలో ఒంటరైన ఆయన మానసిక స్థితి సరిగ్గా ఉండేది కాదట. కొన్ని సార్లు ఎక్కడికి వెళుతున్నాడో అతనికే తెలీదని చెప్పేవారట. 2008 లో అతను మెదడుకు సంబంధించిన వ్యాధి బారిన పడి జ్ఞాపకశక్తిని కోల్పోయాడని అతని స్నేహితులు తెలిపారు. ఎన్నో మధురమైన పాటలతో ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న కుల శేఖర్ జీవితం ఎంతో విషాదకరంగా ముగిసింది. కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న తుది శ్వాస విడిచారు. ఎవరూ లేని అనాథలా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. Also Read : ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి