అరుణాచల్‌ప్రదేశ్‌లో డిసెంబర్ 1న సియాంగ్ ఇకో అడ్వెంచర్ ఫెస్టివల్ ఘనంగా ముగిసింది. 96 రకాల విభిన్నమైన సీతాకోక చిలుకలను గుర్తించినందుకు గానూ ఈ వేడుకను నిర్వహించారు. నాలుగు రోజుల పాటు జరిగిన జరిగిన ఈ కార్యక్రమంలో సియాంగ్ ప్రాంత జీవవైవిధ్యాన్ని ప్రదర్శించారు. కొత్తగా గుర్తించిన వాటిలో సాధారణ జాతులతో పాటు సింగ్లెటన్, మయన్మార్ క్వాకర్ వంటి అరుదైన జాతీ సీతాకోకచిలుకలు కూడా ఉన్నాయి. అలాగే కామన్ పికాక్, పారిస్ పికాక్, కామ్ ఒనిక్స్ వంటి అందమైన సీతాకోకచిలుకలు కూడా ఉన్నాయి.
Also Read: ఫడ్నవీస్ కే పట్టం.. ఆయనను మళ్లీ సీఎం చేసిన 6 ముఖ్య కారణాలివే!
ఈ సీతాకోకచిలుకల జాతులు సియాంగ్‌ను జీవవైవిధ్య హాట్‌స్పాట్‌గా చూపిస్తున్నాయి. అలాగే ప్రకృతి ప్రేమికులు తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించాలని చాటిచెప్పుతున్నాయి. ఈ వేడుకను వీక్షేంచేందుకు దేశంలోని కర్ణాటక, ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రకృతి ఔత్సాహికులు వచ్చారు. అంతేకాదు టాంజానియా లాంటి విదేశాల నుంచి కూడా సియాంగ్‌కు వచ్చారు.
Also Read: అయ్యప్ప భక్తులకు తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బస్సు!
ఈ కార్యక్రమాన్ని సందర్శించడానికి వచ్చినవారి కోసం.. ప్రకృతి నడకలు, అలాగే ఎడ్యుకేషనల్ వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు నిర్వాహకులు అవకాశం కల్పించారు. భారత్‌లో ఇకో టూరిజంను ప్రోత్సహించేందుకు, సియాంగ్‌ను సీతాకోకచిలుక టూరిజంగా చేయాలనే లక్ష్యంతోనే ఈ వేడుకను నిర్వహించారు. ఇదిలాఉండగా.. తెలంగాణ కూడా రాష్ట్ర సీతాకోకచిలుకను ఎంపిక చేయనుంది. వాస్తవానికి భారత్‌కు జాతీయ సీతాకోకచిలుక లేదు. కానీ గత ఐదేళ్లలో 10 రాష్ట్రాలు తమ సొంత రాష్ట్ర సీతకోకచిలుకల జాతులను ప్రకటించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణ కూడా రాష్ట్ర సీతాకోకచిలకను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
Also Read: స్వర్ణ దేవాలయంలో కాల్పులు.. సుఖ్‌బీర్ సింగ్‍పై హత్యాయత్నం
Also Read: మార్షల్ లా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఎత్తివేత.. కారణమేంటి?