Pending Challans: పెండింగ్‌ చలాన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు..ఇకపై  స్వచ్ఛందంగా చెల్లిస్తేనే...

పెండింగ్ చలాన్ల విషయంలో వాహనదారులకు హైకోర్టు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ట్రాఫిక్ పోలీసులు చలాన్లు చెల్లించాలని బలవంతపెట్టవద్దని ట్రాఫిక్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే..పోలీసులు వసూలు చేసుకొవచ్చని కోర్టు పేర్కొంది.

New Update
FotoJet - 2026-01-20T171546.184

Telangana High Court

పెండింగ్ చలాన్ల విషయంలో వాహనదారులకు హైకోర్టు(telangana-high-court) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా చలాన్లు వసూలు చేస్తున్నారని హైకోర్టు(telangana high court notices)లో  దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చలాన్లు(telangana-traffic-challan) చెల్లించాలని బలవంతపెట్టవద్దని ట్రాఫిక్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. చలాన్లు చెల్లించాలని బైక్ కీస్ లాక్కోవడం.. వాహనాన్ని ఆపేయడం లాంటివి చేయొద్దని తేల్చి చెప్పింది. వాహనదారులు వాహనం ఆపినప్పుడు  స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే.. పోలీసులు వసూలు చేసుకొవచ్చని కోర్టు పేర్కొంది. వారు చెల్లించడానికి ఇష్టపడని పక్షంలో చట్టప్రకారం కోర్టు నోటీసులివ్వాలని ఆదేశించింది. 

Also Read :  మున్సి'పోల్స్' బరిలో కవిత తెలంగాణ జాగృతి...ఆ గుర్తుపై పోటీ?

High Court Issues Key Orders On Pending Challans

కాగా ఈ విషయమై న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు. పెండింగ్ చలాన్ల వసూలు కోసం ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఇబ్బందిపెడుతున్నారని పేర్కొన్నారు. దీంతో ట్రాఫిక్‌ పోలీసులకు కోర్టు ఆదేశాలు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ పెండింగ్‍లో‍ఉన్న చలాన్ల వసూలు చేయాలని పోలీసులు భావిస్తే కోర్టు నోటీసులు ఇచ్చి న్యాయప్రక్రియ ద్వారా వసూలు చేసుకోవచ్చని తెలిపింది. గత కొంతకాలంగా ట్రాఫిక్ పోలీసులు చలాన్ల పేరుతో వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో, న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. రహదారులపై తనిఖీలు చేసే సమయంలో పెండింగ్ చలాన్లు ఉన్నాయని వాహనదారులను బలవంతపెట్టవద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. చలాన్లు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ వాహనాల కీలను (keys) లాక్కోవడం లేదా వాహనాలను అక్కడే ఆపేసి ట్రాఫిక్ నిరోధించడం వంటి చర్యలు చేపట్టకూడదని కోర్టు నిర్ధిష్టంగా ఆదేశించింది. పోలీసుల విధులు కేవలం నిబంధనలను పర్యవేక్షించడమేనని, చలాన్ల వసూలు కోసం వాహనదారులను వేధించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. - Telangana High Court latest news

వాహనదారుడే స్వచ్ఛందంగా తన పెండింగ్ చలాన్లను క్లియర్ చేయడానికి ముందుకు వస్తేనే పోలీసులు ఆ డబ్బును వసూలు చేయాలని న్యాయస్థానం సూచించింది. ఒకవేళ వాహనదారులు ఆ సమయంలో చెల్లించడానికి ఇష్టపడకపోతే, వారిని నిర్బంధించే అధికారం పోలీసులకు లేదని తేల్సి చెప్పింది. పెండింగ్ చలాన్లను వసూలు చేయడానికి ఒక పద్ధతి ఉంటుందని, నిబంధనల ప్రకారం కోర్టు నోటీసులు పంపాలని హైకోర్టు ఆదేశించింది. పోలీసు యంత్రాంగం నిబంధనలను అతిక్రమించి రోడ్లపై నేరుగా నగదు వసూలు చేయడం సరికాదని అభిప్రాయపడింది. చట్టపరమైన ప్రక్రియ ద్వారా మాత్రమే పెండింగ్ బకాయిలను రాబట్టాలని సూచించింది.  న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, పోలీసుల తీరును తప్పుబడుతూ ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది.

Also Read :  జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ వద్ద టెన్షన్‌..టెన్షన్‌..ముగిసిన హరీశ్‌రావు విచారణ

Advertisment
తాజా కథనాలు