Kamareddy: నీటమునిగిన కామారెడ్డి..రేపు పాఠశాలలకు సెలవు
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్ రేపు (గురువారం) సెలవు ప్రకటించారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలను భారీవర్షాలు కుదిపేస్తున్నాయి.