Geyser: గీజర్ శుభ్రం చేయడం ఎలానో తెలుసా..?

చలికాలం రాకముందే గీజర్‌ను శుభ్రం చేయాలి. క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే గీజర్ లోపల మురికి, ఖనిజాలు అవక్షేపాలు పేరుకుపోతాయి. కరెంట్ బిల్లు తగ్గించి గీజర్‌ను ఎలా శుభ్రం చేసే చిట్కాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
geyser51

Geyser

చలికాలంలో గీజర్ (Geyser) అనేది రోజువారీ జీవితంలో అత్యంత కీలకం. అయితే క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే గీజర్ లోపల మురికి, ఖనిజాలు (minerals) అవక్షేపాలు (sediment) పేరుకుపోతాయి. దీనివల్ల నీరు వేడెక్కడానికి ఎక్కువ సమయం పడుతుంది. విద్యుత్ వినియోగం పెరుగుతుంది, గీజర్ జీవితకాలం తగ్గిపోతుంది. అందుకే గీజర్‌ను శుభ్రం చేయడం, నిర్వహణ చాలా అవసరం. కరెంట్ బిల్లు తగ్గించి చలికాలం రాకముందే గీజర్‌ను ఎలా శుభ్రం చేయాలో కొన్ని చిట్కాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

గీజర్ ఎప్పుడు శుభ్రం చేయాలి..

గీజర్‌ను శుభ్రం చేయాల్సిన అవసరం ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని  సంకేతాలు గమనించాలి. 

తక్కువ నీరు ప్రవాహం (Low Water Pressure): నీటి ప్రవాహం బలహీనపడితే ట్యాంక్‌లో మురికి పేరుకుపోయిందని అర్థం.
నీరు వేడెక్కడానికి ఎక్కువ టైం: హీటింగ్ ఎలిమెంట్‌పై పాచి (Scale) పేరుకుపోయిందని ఇది సూచిస్తుంది.
వింత శబ్దాలు: గీజర్ నుంచి పాపింగ్ లేదా క్రాక్లింగ్ శబ్దాలు వస్తే.. లోపల పేరుకుపోయిన అవక్షేపాలు వేడెక్కుతున్నాయని అర్థం.
నీటిలో దుర్వాసన-రంగు మారడం: ఇది తుప్పు, బ్యాక్టీరియా చేరిన సంకేతం కావచ్చు.

శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్తలు:

శుభ్రం చేయడం ప్రారంభించడానికి ముందు పవర్ సప్లైను మరియు నీటి సరఫరాను తప్పనిసరిగా ఆపివేయాలి. నీరు వెనక్కి రాకుండా నివారించడానికి ఇన్‌లెట్ వాల్వ్‌ను మూసివేయాలి. హాట్ వాటర్ ట్యాప్‌ను తెరవడం ద్వారా ట్యాంక్‌లోని పీడనాన్ని తగ్గించాలి. శుభ్రం చేసేటప్పుడు గ్లౌజులు, గాగుల్స్ ధరించాలి. శుభ్రం చేయడం ప్రారంభించే ముందు గీజర్ పూర్తిగా చల్లబడే వరకు ఆగాలి. ముందుగా పవర్, నీటి సరఫరాను ఆపివేయండి. తర్వాత డ్రెయిన్ వాల్వ్‌ను తెరిచి.. ట్యాంక్‌లోని నీటిని పూర్తిగా బయటకు పంపించాలి.  అనంతరం బేకింగ్ సోడా, వెనిగర్, ప్రత్యేక డెస్కేలింగ్ ద్రావణాన్ని ఉపయోగించి పేరుకుపోయిన అవక్షేపాలను బ్రష్ లేదా గుడ్డతో శుభ్రం చేయాలి. ట్యాంక్‌ను శుభ్రమైన నీటితో నింపి.. పదే పదే శుభ్రం చేయాలి. చివరిగా అన్నింటినీ సరిగ్గా మూసివేయాలి. నీటిని విద్యుత్‌ను ఆన్ చేసి గీజర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో తనిఖీ చేయాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి గీజర్‌ను శుభ్రం చేయడం వల్ల దాని జీవితకాలం పెరుగుతుంది, విద్యుత్ ఆదా అవుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

ఇది కూడా చదవండి: టీ స్త్రైనర్ చిటికెలో శుభ్రం చేసే చిట్కా తెలుసుకోండి

Advertisment
తాజా కథనాలు