Modi: బెంగాల్‌లో అధికారంలోకి వస్తే వాళ్లని తరిమికొడతాం.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

మమత బెనర్జీ పాలనలో అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు పెరిగిపోయాయని విమర్శించారు. బెంగాల్‌లో తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే సరిహద్దుల వద్ద చొరబాట్లను ఆపుతామన్నారు. అక్రమ వలసదారులను రాష్ట్రం నుంచి తరిమికొడతామంటూ హామీ ఇచ్చారు. 

New Update
Modi

Modi

పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఆదివారం రూ.830 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సింగూర్‌లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మమత బెనర్జీ పాలనలో అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు పెరిగిపోయాయని విమర్శించారు. కేంద్రం అందిస్తున్న పథకాలను బెంగాల్ ప్రజలకు అందకుండా చేస్తున్నారంటూ విమర్శించారు. వీళ్ల పాలనతో విసిగిపోయిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. బిహార్‌లో జంగిల్‌ రాజ్‌కు బుద్ధి చెప్పినట్లే 2026 ఎన్నికల్లో మహా జంగిల్ రాజ్‌కు ముగింపు పలుకుతామని వ్యాఖ్యానించారు. 

Also Read: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

రాజకీయ ప్రయోజనాల కోసం తృణమూల్ కాంగ్రెస్ చొరబాటుదారులకు మద్దతిస్తోందని విమర్శించారు. దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టెస్తోందని మండిపడ్డారు. బెంగాల్‌ సరిహద్దులను రక్షించుకోవాలంటే సొంత ప్రయోజనాల కోసం కాకుండా దేశాభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. బెంగాల్‌లో తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే సరిహద్దుల వద్ద చొరబాట్లను ఆపుతామన్నారు. అక్రమ వలసదారులను రాష్ట్రం నుంచి తరిమికొడతామంటూ హామీ ఇచ్చారు. 

Also Read: మచాదోకు రెడ్ బ్యాగ్ గిఫ్ట్ ఇచ్చిన ట్రంప్..అందులో ఏముందో తెలుసా!?

మరోవైపు బెంగాల్‌లో విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు తరచూ జరుగుతున్నాయన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే మహిళలకు, చిన్నారులకు భద్రత అవసరమని తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వమే ప్రజలకు రక్షణ, న్యాయం అందిస్తుందని పేర్కొన్నారు . 

Advertisment
తాజా కథనాలు