TGPSC:  గ్రూప్ –2 ఎగ్జామ్‌ను వాయిదా వేయలేం–హైకోర్టు

తెలంగాణలో గ్రూప్–2 పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. వీటిని వాయిదా వేయడానికి హైకోర్టు నిరాకరించింది.  ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినందువలన వాటిని వాయిదా వేయడానికి కుదరదని తేల్చి చెప్పింది. 

New Update
High Court

గ్రూప్‌-2, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షలు ఒకేరోజు ఉన్నందున వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు అభ్యర్థులు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఇప్పుడు పరీక్షలను వాయిదా వేయలేమని తేల్చి చెప్పింది. ఇప్పటికే వాటికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేసినందువలన కష్టమని స్పష్టం చేసింది. 

డిసెంబర్ 15, 16 తేదీల్లో తెలంగాణలో గ్రూప్–2 ఎగ్జామ్స్ జరగనున్నాయి. రెండు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ నెల 9 నుంచి టీజీపీఎస్సీ వెబ్ సైట్ల నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఇంతకు ముందే అనౌన్స్ చేశారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 1,368 కేంద్రాల్లో గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం పరీక్షకు 1.30 నుంచి 2.30గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు.

Also Read: హైదరాబాద్ ట్రాఫిక్ కోసం హెచ్‌‌– సిటీ

రెండు సెషన్లలో..

ఆబ్జెక్టివ్ టైప్ పేపర్-I జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ డిసెంబర్ 15, 2024న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య నిర్వహించబడతాయి, పేపర్-II, హిస్టరీ, పాలిటీ మరియు సొసైటీ అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు అంటే డిసెంబర్. 15, 2024. ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్‌తో కూడిన పేపర్-III డిసెంబర్ 1, 2024న ఉదయం 10 నుండి 12.30 గంటల మధ్య, తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటుతో కూడిన పేపర్-IV అదే రోజు అంటే 2024 డిసెంబర్ 16న మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల మధ్య జరుగుతుంది.

Also Read: బంకర్ లో విలువైన వస్తువులు..సిరియా అధ్యక్షుడి ప్రైవేట్ బంకర్ చూశారా?

Also Read: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత

Also Read: బంకర్ లో విలువైన వస్తువులు..సిరియా అధ్యక్షుడి ప్రైవేట్ బంకర్ చూశారా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు