హైదరాబాద్ పరిధి చాలా పెరిగిపోయింది. దేశంలో అతి పెద్ద నగరాల్లో ఇప్పుడు ఇదొకటి. కానీ బెంగళూరు తర్వాత అత్యంత ఎక్కవు ట్రాఫిక్ ఉన్న నగరం కూడా ఇదే. గంటలు గంటలు ట్రాఫిక్ జామ్‌తో అష్టకష్టాలు పడుతున్నారు హైదరాబాద్ వాసులు. ఒక పక్క సిటీ అభివృద్ధి చెందుతున్నా ఈ ట్రాఫిక్ కష్టాలు మాత్రం తీరడం లేదంటూ వాపోతున్నారు. ఇవి దృష్టిలో ఉంచుకుని వీటికి చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది గవర్నమెంట్.
హెచ్ సిటీ ప్రాజెక్ట్..
హెచ్-సిటీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ఈ పనుల కోసం ఏకంగా సుమారు రూ.6 వేల కోట్లు విడుదల చేసింది. హెచ్-సిటీ ప్రాజెక్టుతో హైదరాబాద్ కు ప్రధాన సమస్యగా మారిన రహదారులను పెద్ద ఎత్తున బాగు చేయనున్నారు. ట్రాఫిక్ కష్టాలను తీర్చడం, వరద ముంపును తప్పించేలా నగరం నలుమూలలా ఫ్లైఓవర్‌లూ, అండర్‌పాస్‌లు, ఆర్‌యూబీ, ఆర్‌వోబీలను నిర్మించనున్నారు. ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా ఈ ప్రాజెక్టును ముగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్డర్ చేశారు.