TGPSC: తెలంగాణలో గ్రూప్-3 ప్రిలిమినరీ 'కీ'ని టీజీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in లోకి వెళ్లి అభ్యర్థులు 'కీ' ని చూసుకోవచ్చు. జనవరి 12 సాయంత్రం 5 గంటల వరకు కమిషన్ అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించనుంది. ఇంగ్లీష్‌లోనే అభ్యంతరాలు తెలియజేయాలని, అభ్యర్థులు లేవనెత్తిన అంశాలకు సంబంధించిన ఆధారాల కాపీలను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలని సూచించింది. ఈ-మెయిల్ లేదా వ్యక్తిగతంగా వెళ్లి సమర్పించేందుకు పర్మిషన్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. Also Read: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి అలర్ట్.. పోలీసుల కీలక సూచనలు! ఇదిలాఉండగా.. రాష్ట్రంలో 1365 ఉద్యోగ ఖాళీల కోసం గత ఏడాది నవంబర్ 17,18న గ్రూప్ 3 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తందా 1401 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం మూడు పేపర్లకు పరీక్షలు జరిగాయి. అయితే గ్రూప్ 3 కోసం రాష్ట్రవ్యాప్తంగా 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ 2,69,483 లక్షల మంది మాత్రమే అంటే దాదాపు సగం మంది అభ్యర్థులే పరీక్షకు హాజరయ్యారు. Also Read: దేశంలో మరో కొత్త వైరస్.. పట్టుకుంటే 3 రోజుల్లో జుట్టు మటాష్! ఇదిలాఉండగా టీజీపీఎస్సీ మరో కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని పేర్కొంది. మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది. ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా ఖాళీ ప్రకారం నోటిఫికేషన్ల జారీపై ఏప్రిల్‌లో కసరత్తు చేస్తామని పేర్కొంది. కొత్త నోటిఫికేషన్లు ఇచ్చాక 6 నుంచి 8 నెలల్లోనే భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని కమిషన్ స్పష్టం చేసింది. Also Read: నా కొడుకు చెప్పేవి వినొద్దు.. ఎలాన్ మస్క్ తండ్రి సంచలన వ్యాఖ్యలు Also Read: ఇష్టం లేని పెళ్లి చేసుకున్న మేనకోడలు.. మామ చేసిన పనికి అంతా షాక్