ఓ పెళ్లి వేడుకలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అతిథుల కోసం ఏర్పాటు చేసిన భోజనంలో ఓ వ్యక్తి విషం కలపాడు. తన మేనకోడలు తనకు ఇష్టం లేని వివాహం చేసుకుంటుందనే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. Also read: బాలయ్య హీరోయిన్ కు వేధింపులు.. 27మందిపై కేసు, పోలీసుల అదుపులో వ్యాపార వేత్త ఇక వివరాల్లోకి వెళ్తే.. కొల్పాపూర్ జిల్లాలోని ఉట్రే అనే గ్రామంలో ఓ వ్యక్తి ఉంటున్నాడు. అయితే తన ఇంట్లోనే పెరిగిన మేనకోడలు మరో వ్యక్తిని ప్రేమించింది. ఇటీవలే ఇద్దరికీ పెళ్లి కూడా జరిగింది. కానీ ఆమె మేనమామకు ఇది నచ్చలేదు. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంపై తన మేనమామ ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఇటీవల మేనకోడలి పెళ్లి రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు వెళ్లిన ఆమె మేనమామ దారుణానికి పాల్పడ్డాడు. అతిథుల కోసం ఏర్పాటు చేసిన వంటకాల్లో ఏకంగా విషం కలిపేశాడు. Also Read: తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్.. మందుబాబులకు బిగ్ షాక్! అక్కడున్న కొందరు గమనించి అతడిని అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చేసరికే నిందితుడు రిసెప్షన్ వేడుక నుంచి పారిపోయాడు. అయితే అక్కడ వండిన భోజనాన్ని అతిథులెవరూ తినలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. చివరికీ పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. అలాగే ఆహార పదార్థాలను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అతడు వంటల్లో విషం కలపడాన్ని ఎవరూ చూడకపోయుంటే వేడుకకు వచ్చిన అతిథుల ప్రాణాలకు ముప్పు ఉండేదని గ్రామస్థులు చెబుతున్నారు. Also Read: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి అలర్ట్.. పోలీసుల కీలక సూచనలు! Also Read: అలా చేయడం లైంగిక వేధింపుతో సమానం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు