/rtv/media/media_files/2025/01/08/iN1kHIxkRzz4qxSFwWKb.jpg)
Mysterious Hair Loss
గత రెండు మూడేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోన మహమ్మారి గురించి అందరికీ తెలిసిందే. ఈ వైరస్ కారణంగా మనుషులు పిట్టల్లా రాలిపోయారు. రోజుకు కొన్ని వేల మంది మరణించారు. ఫస్ట్ టెర్మెలో కరోన విజృంభనతో ప్రజలు గజగజ వణికిపోయారు. ఇక ఇప్పుడిప్పుడే అంతా కోలుకున్నారు. కరోనా లాంటి వైరస్ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటున్నారు.
Also Read: తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్.. మందుబాబులకు బిగ్ షాక్!
ఈ తరుణంలో HMPV అనే మరో వైరస్ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. చైనాలో అధికంగా ఉన్న ఈ వైరస్.. ఇప్పుడిప్పుడే భారత దేశానికి వచ్చింది. ఇప్పటి వరకు భారత దేశంలో పదుల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. దీంతో భారత ప్రజలు భయం భయంతో బతుకుతున్నారు. ఈ సమయంలో దేశంలో మరో వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది.
Also read: బాలయ్య హీరోయిన్ కు వేధింపులు.. 27మందిపై కేసు, పోలీసుల అదుపులో వ్యాపార వేత్త
భయపెడుతోన్న మరో మహమ్మారి
అవును మీరు విన్నది నిజమే. భారత దేశంలో మరో మహమ్మారి ప్రజలను వణికిస్తోంది. ఎవరికీ తెలియని ఆ రోగంతో ప్రజలు తమకు ఏమైందో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మహారాష్ట్రలో ఆ సరికొత్త రోగం దాపురించింది. దానివల్ల తలపై ఉన్న జుట్టంతా మూడు రోజుల్లో ఊడిపోతుంది. దీంతో అక్కడి ప్రజలు భయపడుతున్నారు.
Buldhana Hair Loss Story : 3 दिवसात डोक्यावर पडतंय टक्कल! अजब आजाराने गावकरी हैराण...#Buldhana#Maharashtrapic.twitter.com/oMLQRhFehL
— ABP माझा (@abpmajhatv) January 8, 2025
Also Read: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి అలర్ట్.. పోలీసుల కీలక సూచనలు!
మహారాష్ట్రలోని షెగావ్‌లోని బుల్దానాలో ఇది వ్యాపించింది. షేగావ్‌లోని కలవాడ్, బోండ్‌గావ్, హింగానా గ్రామాల్లోని ప్రజలు గుర్తు తెలియని ఈ వైరస్‌తో కొట్టిమిట్టాడుతున్నారు. ఈ వైరస్ కారణంగా పురుషులు, స్త్రీలు తమ జుట్టును కోల్పోతున్నారు. ఈ వైరస్ సోకి తర్వాత మొదటి రోజు దురద పుడుతుంది. రెండవ రోజు వెంట్రుకలు రాలిపోవడం మొదలెడుతుంది. ఇక మూడవ రోజుకి జుట్టంతా రాలిపోతుంది.
ఇప్పటికి అక్కడి సమీప గ్రామాల ప్రజలు తమ జుట్టును కోల్పోయారు. ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో అక్కడి ప్రజలు బతుకుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో మరింత అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నారు. దీనిపై షెగావ్‌లోని శివసేన చీఫ్ రామేశ్వర్ థార్కర్ జిల్లా ఆరోగ్య ఆఫీసర్‌కి ఒక స్టేట్‌మెంట్ అందించారు. వెంటనే దానికి గల కారణాలు, అలాగే బాధిత గ్రామాల్లో ట్రీట్మెంట్ శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. చూడాలి మరి ఈ వైరస్‌కు గల కారణాలేంటి..? ఎందుకు ఇలా జరుగుతుందో అని.