/rtv/media/media_files/2025/03/07/PUYkaLSa9trG9a1MrdEv.jpg)
Union minister mansukh mandaviya
EPF: ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఏటీఎం ద్వారా కూడా ఈపీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి డా. మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. హైదరాబాద్ బేగంపేటలోని బ్రాహ్మణాడిలో నూతనంగా నిర్మించిన ఈపీఎఫ్ఓ కార్యాలయ భవనం, తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం, బంజారాహిల్స్ రీజినల్ కార్యాలయ భవనాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి మాండవీయ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాండవీయ మాట్లాడుతూ.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లావాదేవీలు ఇక 3.O వెర్షన్‌లోకి మారనున్నాయన్నారు. బ్యాంక్ తరహాలోనే ఈపీఎఫ్ఓ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.
ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!
ఈపీఎఫ్ చందాదారులు ఏటీఎంల వద్దకు వెళ్లి తమ ఈపీఎఫ్ డబ్బును డ్రా చేసుకోవచ్చని కేంద్రమంత్రి తెలిపారు. చిన్న చిన్న సవరణలను ఆన్‌లైన్‌లోనే చేసుకునే వీలు కల్పిస్తున్నామన్నారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సనత్ నగర్ ఈఎస్ఐసీ హాస్పిటల్, మెడికల్ కాలేజీ నెంబర్ 1గా నిలిచాయన్నారు. ఇందుకు మాండవీయకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో మరిన్ని ఆస్పత్రులు, వైద్య కళాశాలలు నిర్మించాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని కిషన్ రెడ్డి తెలిపారు. రామగుండం వంటి చోట్ల స్థలం కేటాయిస్తే పనులు ప్రారంభిస్తామని కేంద్రమంత్రి చెప్పారు.
ఇది కూడా చూడండి: gold smuggling : పోలీస్ బాస్‌కు క్రిమినల్ హిస్టరీ.. స్మగ్లింగ్ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రి కూడా..
సిద్దిపేటలోని ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని వేరొక కార్యాలయంలో విలీనం చేస్తున్నారనే వదంతులు వస్తున్నాయి.. ఆ కార్యాలయాన్ని అక్కడే కొనసాగించేలా అనుమతించాలని కేంద్రమంత్రి మాండవీయను మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కోరారు. ఈ క్రమంలో స్పందించిన కేంద్రమంత్రి మాండవీయ.. ఆ కార్యాలయాన్ని సిద్దిపేటలోనే కొనసాగించాలని కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేశ్ కృష్ణమూర్తిని ఆదేశించారు. ఈ క్రమంలో కేంద్రమంత్రికి రఘునందన్ రావు ధన్యవాదాలు తెలిపారు.
ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!