/rtv/media/media_files/2025/07/11/ganja-gang-arrested-2025-07-11-17-41-28.jpg)
Ganja gang arrested
TG Crime: రాష్ట్రంలో మత్తు పదార్థాల విక్రయం, రవాణా, వినియోగం పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న ప్పటికీ కొంతమంది దొడ్డిదారిన తమ దందాను కొససాగిస్తున్నారు. తాజాగా ఒడిశా నుంచి విశాఖపట్నం మీదుగా పూణే కు తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ రవాణాలో కీలకంగా ఉన్న అంతర్రాష్ట్ర గాంజా ముఠా సభ్యులను రాజేంద్రనగర్ జోన్ ఎస్.ఓ.టి పోలీసులు, రాజేంద్రనగర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ముఠా నుంచి 108 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.
Also Read: BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్
ఈ సందర్భంగా ఆరుగురు సభ్యులు గల ముఠాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అక్రమంగా డబ్బు సంపాదించాలను కున్న పుణేకు చెందిన ప్రశాంత్ గణేష్, లత గణేష్ జాదవ్, సచిన్ దిలీప్, రోహన్, రాహుల్ బాబురావు, గౌరవ్ నాటేకర్ ఒక ముఠాగా ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి రెండు కార్లలో ఒడిస్సా నుంచి పుణె కి గంజాయిని రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా తరలించేందుకు ప్లాన్ వేశారు. విశ్వసనీయ సమాచారంతో రాజేంద్రనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 17 వద్ద అడ్డా వేసి రెండు వాహనాలను ఆపి తనిఖీ చేశారు.
Also Read:వర్షాకాలంలో వంకాయలు తింటే ప్రమాదకరమా..? ఇక్కడ వివరాలు తెలుసుకోండి
ఈ తనిఖీల్లో రెండు కార్లలో రూ. 60 లక్షల విలువచేసే 108 కేజీల గంజాయి, 6 సెల్ ఫోన్లు, రూ. 9,700 నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీశ్రీనివాస్ వెల్లడించారు. నిందితులంతా గతంలో నేరచరిత్ర కలిగి ఉన్నారని, మహారాష్ట్రలో కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. వీరు ఒడిశాలో రూ. 2500కు కిలో చొప్పున గంజాయి కొనుగోలు చేసి పుణేకు తరలించి అక్కడ రూ.20 వేలకు పైగా కిలో చొప్పున విక్రయిస్తున్నారని డీసీపీ తెలిపారు. కేసు నమోదు చేసుకని నిందితులను రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.
Also Read: Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్