Gaddar Awards : జూన్ 14న గద్దర్ అవార్డులు...కార్యక్రమం ఎక్కడంటే...

జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజ్ చెప్పారు.హెచ్ఐసీసీ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అవార్డ్స్ కర్టెన్ రైజ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది.

New Update
Gaddar Awards

Gaddar Awards

జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజ్  చెప్పారు. హెచ్ఐసీసీ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డ్స్ కర్టెన్ రైజ్ కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు, గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్‌ జయసుధ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Also Read: Trump Vs Harvard: ట్రంప్ ప్రభుత్వంపై హార్వర్డ్ దావా

Gaddar Awards On June 14th 2025

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎ భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఏర్పాటు చేసుకున్న అవార్దులని పేర్కొన్నారు. దశాబ్దకాలంగా పరిశ్రమ ఎలాంటి ప్రొత్సహకాలకు, అవార్డులకు నోచుకోలేదన్నారు. దశాబ్దకాలంగా సినిమా రంగాన్ని నిర్లక్ష్యం చేయడం మంచి సంప్రదాయం కాదని సీఎం భావించారు.గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రవేశపెట్టడానికి చాలా కారణాలున్నాయి. తన గళంతో తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తం చేసిన గాయకుడు గద్దర్‌ అన్నారు. గద్దర్ పుట్టడం తెలంగాణ రాష్ట్ర అదృష్టమన్నారు. తన పాటతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారన్నారు. అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డులు ఇవ్వడం సముచిత నిర్ణయమని భట్టి అన్నారు.

Also Read: Ap Tenth Results:రేపే ఏపీ టెన్త్‌ రిజల్ట్స్‌!

కళలకు పుట్టినిల్లు హైదరాబాద్అని గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల పట్ల ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందన్నారు. ప్రతివారు ఈ అవార్డులు గురించి మాట్లాడుకునేలా వేడుకలు చేస్తామని స్పష్టం చేస్తారు.
చలన చిత్ర అవార్డులతోపాటు వ్యక్తిగత అవార్డులను కూడా పొందుపర్చుతామన్నారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండేలా అవార్డుల ప్రదానం చేస్తామన్నారు. అవార్డుల కోసం ఎలాంటి రాగద్వేషాలకు అతీతంగా సినిమాల ఎంపిక ఉండాలని జ్యూరీని కోరారు. గద్దర్ పేరుతో ఇచ్చే అవార్డులపై ఎన్ని విమర్శలు వచ్చిన ఆయన పేరుతో అవార్డులు ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ సమావేశంలో హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు, జ్యూరీ ఛైర్మన్ జయసుధ, ఐ అండ్ పీఆర్ ఎండీ హరీశ్ పాల్గొన్నారు.

Also Read: Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ డెత్ రిపోర్ట్ వచ్చింది...అందులో ఏముందంటే..

Also Read :  పార్లమెంట్‌ కంటే అత్యుత్తమమైనది మరొకటి లేదు: ఉప రాష్ట్రపతి

 

dil-raju | batti-vikramarka | gaddar-awards | komatireddy venkat reddy latest news | Telangana Gaddar Awards

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు