Bandi Sanjay: నెలరోజుల్లోగా గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjaya On Sarpanch Elections) డిమాండ్ చేశారు. లేకుంటే హైదరాబాద్ నడిబొడ్డున స్థానిక ప్రజాప్రతినిధులతో పరేడ్ నిర్వహిస్తామని వార్నింగ్ ఇచ్చారు. రెండేళ్లుగా రాష్ట్రంలోని పంచాయతీలకు నిధులు ఇవ్వలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.
నిధులు ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి గ్రామాలకు నిధులొచ్చేదాకా పోరాడతామన్నారు. దీనికి రాష్ట్రంలోని సర్పంచులు, ఉప సర్పంచులంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. నిధుల విడుదలకు కాంగ్రెస్ సర్కార్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ నెలరోజుల డెడ్ లైన్ విధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ కసరత్తు చేస్తుందని.వీటిని సంక్రాంతి పండగ వెళ్లిన తర్వాత చేపట్టాలని భావిస్తుందని మంత్రి అన్నారు. ఒకవేళ ఈ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే.. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఇది నిధుల విడుదలకు అడ్డంకిగా మారుతోందన్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. - bjp party Candidate In Sarpanch Elections
Also Read : ఒక్కో గ్రామానికి రూ.10 లక్షలు.. కొత్త సర్పంచ్ లకు సీఎం రేవంత్ న్యూ ఇయర్ గిఫ్ట్!
Bandi Sanjay Sensational Comments
బుధవారం కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. పంచాయితీలకు ఇచ్చిన నిధులన్నీ కేంద్రానివే అని స్పష్టం చేశారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ రాకముందే.. నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆయన సూచించారు. కరీంనగర్ ఎంపీ పరిధిలో బీజేపీ సర్పంచులను గెలిపించిన 108 గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, ఆయా గ్రామాల్లో ….ఊరికో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తా..ఆయా పీహెచ్ సీలకు అవసరమైన మెడికల్ ఎక్విప్ మెంట్స్ ను అందజేస్తానని హామీ ఇచ్చారు. ఆయా సర్కారీ స్కూళ్లలో టాయిలెట్లను ఏర్పాటు చేయిస్తానన్న బండి సంజయ్ విద్య, వైద్యానికి నా తొలి ప్రాధాన్యత అని వివరించారు. 9వ తరగతి చదివే విద్యార్థులకు సర్పంచ్ ల ఆధ్వర్యంలో సైకిళ్లను పంపిణీ చేయిస్తానని మంత్రి తెలిపారు.
సర్పంచ్ అనేది పదవి కాదు… మీ ఊరి బాధ్యత..ప్రజలకు కష్టమొస్తే ఆదుకునే తండ్రి బాధ్యత సర్పంచ్ లదేనన్నారు. ఇతర సర్పంచ్ లకు ఆదర్శంగా ఉండేలా బీజేపీ సర్పంచులు వ్యవహరించాలన్నారు. బాసిజం చేస్తే ప్రజల్లో వ్యతిరేకత మొదలైనట్లేనని, అడ్డగోలు హామీలిస్తే ఇబ్బందుల్లో పడతారని హెచ్చరించారు. పార్టీ గుర్తుతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చేది కాదని సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఎంపీ పరిధిలో బీజేపీ మద్దతుతో గెలిచిన బీజేపీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘనంగా సన్మానించారు.
Also Read : సహకార సంఘాలకు బిగ్ షాక్.. నో ఎలక్షన్స్.. ఓన్లీ నామినేటెడ్
Bandi Sanjay: నెల రోజుల్లో పంచాయతీలకు నిధులివ్వాల్సిందే..లేదంటే పరేడ్ తప్పదు..కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్‌కామెంట్స్
నెలరోజుల్లోగా గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేకుంటే హైదరాబాద్ నడిబొడ్డున స్థానిక ప్రజాప్రతినిధులతో పరేడ్ నిర్వహిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
Bandi Sanjay Comments on sarpanchs