Maoists Letter : మాజీ ఎమ్మెల్యే సోదరుడు టార్గెట్‌.. మావోయిస్టుల పేరుతో లేఖ..

మేడ్చల్‌ జిల్లాలోని షాపూర్‌నగర్‌లో మావోయిస్టు పేరుతో బెదిరింపు లేఖ రావడం స్థానికంగా కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ సోదరుడి కుటుంబాన్ని బెదిరిస్తూ లేఖ రాశారు. రూ.50 లక్షలు ఇవ్వకపోతే కూన రాఘవేందర్‌ గౌడ్‌ను చంపుతామని పేర్కొన్నారు.

New Update
Maoists Letter

Maoists Letter : ఓ వైపు మావోయిస్టులు వరుస ఎన్‌కౌంటర్లతో సతమతమవుతుంటే వారి పేరుతో బెదిరింపు లేఖలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా మేడ్చల్‌ జిల్లాలోని షాపూర్‌నగర్‌లో మావోయిస్టు పేరుతో బెదిరింపు లేఖ రావడం స్థానికంగా కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ సోదరుడి కుటుంబాన్ని బెదిరిస్తూ లేఖ రాయడంతో సంచలనంగా మారింది. శ్రీశైలం గౌడ్‌ సోదరుడు కూన రవీందర్‌గౌడ్‌ కుమారుడు కూన రాఘవేందర్‌ గౌడ్‌ను చంపుతామని ఈ లేఖలో పేర్కొనడం స్థానికంగా కలకలం రేగింది.

ఇది కూడా చూడండి:SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్

రూ.50 లక్షలు ఇవ్వకపోతే కూన రవీందర్‌గౌడ్‌ కుమారుడు కూన రాఘవేందర్‌ గౌడ్‌ను చంపుతామని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. అంతేకాక వారి రెండు ఇండ్లను బాంబులతో పేల్చేస్తామని హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తి ఇంటి ముందు వస్తువులు ధ్వంసం చేసి అక్కడ లేఖను ఉంచారు. మరుసటి రోజు వస్తామని, డబ్బు ఇవ్వకపోతే తనకున్న రెండు ఇండ్లను బాంబులతో పేల్చేస్తామని అందులో పేర్కొన్నారు. కాగా దుండగులు కారుపై ఎరుపు రంగు టవల్‌లో లేఖ పెట్టి వెళ్లిపోయారు.

ఇది కూడా చూడండి: సంచలన అప్‌డేట్‌.. పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ బాంబు దాడి !

ఘటన ఈ నెల 21న జరిగినట్లు రాఘవేందర్‌గౌడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ వ్యక్తి మాస్క్‌ ధరించి వచ్చినట్లుగా గుర్తించారు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

ఇది కూడా చూడండి:బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు