BRS Big Shock To RS Praveen : BRSలోకి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతుంది. కోనప్ప చేరికకు బీఆర్ఎస్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. అయితే కోనప్ప చేరికకు బీఆర్‌ఎస్‌ ఒకే అంటే ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ పరిస్థితి ఏంటీ అనేది చర్చనీయంశంగా మారింది.

New Update
BRS Big Shock To RS Praveen

BRS Big Shock To RS Praveen

BRS Big Shock To RS Praveen : సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండే కోనప్ప పోటీ చేసిన సంగతి తెలిసిందే. అదే నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలోకి గారు. దీంతో కోనప్ప 3 వేల ఓట్ల తేడాతో ఓడి పోయారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ విజయం సాధించారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో నిలవడం వల్లే తన ఓట్లు చీలి ఓడిపోయానని కొనప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్‌ఎస్‌లో చేరడంతో కోనప్ప అలిగి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ, గత కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ పార్టీలోనూ ఆయన తిరుగుబాటు బావుటా ఎగరవేస్తున్నారు.

ఇదిలా ఉండగా గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి తనకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని కోనప్ప అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కొనప్ప కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పిలిపించుకుని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనకు హామీలు ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. కానీ ఆ తర్వాత కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం హామీ ఇచ్చినా కౌటాల బ్రిడ్జికి అనుమతి రాలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించాలని కోనప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఐతే కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో కోనేరు కోనప్ప ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కోనప్ప కొద్దికాలంగా సొంతంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో తిరిగి ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ టాక్ వినిపిస్తోంది.

 ఈ క్రమంలోనే కోనేరు కోనప్ప చేరికకు బీఆర్ఎస్ హైకమాండ్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. బీఆర్ఎస్‌లో చేరికపై కేసీఆర్‌తో ఇప్పటికే కోనప్ప చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కోనప్ప చేరిక విషయంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, జోగు రామన్న, జగదీశ్ రెడ్డి మధ్యవర్తిత్వం వహించినట్లు ప్రచారం సాగుతోంది.ఈ క్రమంలోనే తాను BRSను వీడడానికి గల కారణాలను కోనప్ప కేసీఆర్‌కు వివరించినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత BRSలో చేరికకు ముహుర్తం ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది.

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కు బిగ్‌షాక్‌..

అయితే గత ఎన్నికల్లో సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పోటీ చేశారు. అయితే అక్కడ ఆయన 3 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ఆ తర్వాత బీఎస్పీ ని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. దీన్ని కోనప్ప వ్యతిరేకించారు. తన ఓటమికి కారణమైన ప్రవీణ్‌ను ఎలా చేర్చుకుంటారంటూ ఆయన పార్టీ వీడారు. ఆ తర్వాత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కు బీఆర్‌ఎస్‌ నాగర్‌ కర్నూల్‌ ఎంపీటికెట్‌ కేటాయించింది.అయితే కాంగ్రెస్‌ గాలిలో ఆయన ఎంపీగా కూడా ఓడిపోయారు. అయితే ఒకవేళ కోనప్ప చేరికకు బీఆర్‌ఎస్‌ ఒకే అంటే ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ పరిస్థితి ఏంటీ అనేది చర్చనీయంశంగా మారింది. అయితే ఈ విషయమై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌తో బీఆర్‌ఎస్‌ నాయకులు చర్చించనున్నట్లు తెలుస్తోంది. కోనప్పకు కూడా ప్రవీణ్‌తో సమన్వయం చేసుకోవాలని కేసీఆర్‌ సూచించినట్లు  తెలిసింది. ఒకవేళ కోనప్ప బీఆర్‌ఎస్‌ లో చేరితే ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ పార్టీలో ఉంటారా? లేక ఆయనకూడా దూరం అవుతారా అనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనను వదులుకునే పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ లేదు. ఒకవేళ కోనప్ప చేరికను ఆర్‌ఎస్‌ అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లోనూ ఆయనను ఎంపీగా నాగర్‌కర్నూ్‌ల్‌ లేదా పెద్దపల్లి నుంచి పోటీ చేయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Also Read: Neha Sharma: డైరెక్టర్ గా మారిన రామ్ చరణ్ ఫస్ట్ హీరోయిన్.. ఏకంగా స్టార్ హీరోతోనే సినిమా!

Advertisment
తాజా కథనాలు