జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తీవ్రంగా ఖండించారు. బన్నీ ఇంటి దగ్గర ఆయన మీడియాతో మాట్లాడారు. అందరూ కాస్త ఓపికగా ఉండాలని పిలుపు నిచ్చారు అరవింద్. మా ఇంటి బయట జరిగిందంతా చూశారు. ప్రస్తుతం మేం కూడా సంయమనం పాటించాల్సిన సమయం. దేనికీ రియాక్ట్ కాకూడదు. దయచేసి ఎవరూ ఎలాంటి తొందరపాటు చర్యలకూ పాల్పడవద్దని అరవింద్ అభ్యర్ధించారు. దయచేసి అర్ధం చేసుకోండి.. పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని తీసుకెళ్లారు. కేసు పెట్టారు. మళ్ళీ ఎవరైనా గొడవ చేయడానికి వస్తే అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని అల్లు అరవింద్ చెప్పారు. ఎవరు ఇలాంటి దుశ్చర్యలకు ప్రేరేపించకూడదని ఆయన కోరారు. ప్రస్తుతం అన్ని అంశాలు చాలా సున్నితంగా ఉన్నాయని...అందరూ దానిని అర్ధం చేసుకోవాలని చెప్పారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగింది. ఓయూ జేఏసీ అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించింది. పలువురు జేఏసీ నాయకులు బన్నీ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. బాడీగార్డ్‌లు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిపై కొందరు తిరగబడ్డారు. అల్లు అర్జున్ వల్లే రేవతి చనిపోయిందంటూ వారు ఆరోపిస్తున్నారు. వెంటనే రేవతి కుటుంబానికి బన్నీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా రేవతి కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ కుటుంబానికి అన్ని విధాల ఆదుకోవాలని జేఏసీ నాయకులు కోరుతున్నారు. ఇక విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకి చేరుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. Also Read: Cricket: ఆసీస్ మీడియా నోటి దురద..కోహ్లీపై అక్కసు