Fire Accident : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు బసచేసే హోటల్‌లో అగ్నిప్రమాదం

సన్ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు బస చేసిన హైదరాబాద్‌  బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో హోటల్ మొత్తం అలజడి చెలరేగింది. టూరిస్టులు, సిబ్బంది భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. 

New Update
fire accident in hotel

fire accident in hotel

Fire Accident : హైదరాబాద్‌  బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి.ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో హోటల్ మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో హోటల్ మొత్తం అలజడి చెలరేగింది. టూరిస్టులు, సిబ్బంది భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. 

Also Read: 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన తోడేళ్లు మళ్లీ తిరిగొస్తున్నాయ్..!!

Also Read: Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?

 అప్రమత్తమైన హోటల్ యాజమాన్యం వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.భారీగా ఎగసిపడుతోన్న మంటలతో దట్టమైన పొగలు ఆ ప్రాంతం వేగంగా వ్యాపించాయి. స్పాట్‌కు చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మొదటి అంతస్తులో విద్యుత్‌ వైర్లు కాలడంతోనే ప్రమాదం జరిగినట్లు ఫైర్‌ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం హోటల్‌లో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు చెప్పారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ఆ హోటల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు బస చేస్తున్నట్లు తెలుస్తోంది. మంటల ధాటికి పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలముకున్నాయి. దీంతో హోటల్‌లో అలజడి చెలరేగింది. టూరిస్టులు, సిబ్బంది భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.

Also Read: Mehul Choksi: బెల్జియంలో మెహుల్‌ ఛోక్సీ అరెస్ట్‌!

Also Read: Bengaluru: 3 రాష్ట్రాలు..700సీసీ కెమెరాలు..దొరికిన బెంగళూరు లైంగికవేధింపుల కేసు నిందితుడు

కాగా పార్క్‌హయత్‌లోనే సన్ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు బస చేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో జట్టు సభ్యులెవరూ అక్కడ లేరని తెలుస్తోంది. కాగా ఎలాంటి ప్రాణనష్టం లేకుండా మంటలు అదుపులోకి రావడంతో పోలీసులు.హోటల్‌ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: భక్తులకు TTD అదిరిపోయే శుభవార్త.. ఇక క్యూ లైన్లో ఉండాల్సిన అవసరమే లేదు!

Also Read: Delhi: చల్లదనం కోసం తరగతి గదులకు ఆవుపేడ అలికిన ప్రిన్సిపల్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు