/rtv/media/media_files/2025/02/21/6AEaY0KWzNXIYcCz4l7t.jpg)
Fire Accident
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉండే ప్రముఖ హార్ట్ కప్ కేఫ్ (Heart Cup Cafe) అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. 2025 అక్టోబర్ 24 శుక్రవారం ఉదయం జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో కేఫ్ పూర్తిగా కాలి బూడిదైంది. సాయంత్రం వేళల్లో సందర్శకులతో కళకళలాడే ఈ ప్రదేశం అగ్నిప్రమాదం(fire accident) కారణంగా భారీ నష్టాన్ని చవిచూసింది.
హార్ట్ కప్ కేఫ్ అగ్నికి ఆహుతి..
జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని పెద్దమ్మ గుడి సమీపంలోనే ఈ హార్ట్ కప్ కేఫ్ జంక్షన్ కూడా ఉంది. ఈ కేఫ్ కొంతకాలంగా మూసివేయబడి ఉంది. అందువల్ల ఈ భారీ అగ్ని ప్రమాదం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదం జరిగిన సమయంలో కేఫ్‌లో ఎవరూ లేరని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ అగ్ని ప్రమాదంలో కేఫ్‌లోని ఫర్నిచర్, అలంకరణ వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. కుర్చీలు, టేబుళ్లు, ఇతర సామగ్రి మొత్తం ధ్వంసమైందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. సమాచారం అందిన వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ.. అప్పటికే చాలావరకు సామగ్రి కాలిపోయినట్లు గుర్తించారు.
ఇది కూడా చదవండి: బ్లాక్ హెడ్స్ మీ ముఖం అందాన్ని తగ్గిస్తున్నాయా..? అయితే వైద్యులు సూచించే ఈ ఇంటి చిట్కా ట్రై చేయండి!!
అయితే ఈ మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది తక్షణ చర్యలు తీసుకున్నారు. దీంతో సమీపంలోని ఇతర ప్రాంతాలకు ప్రమాదం విస్తరించకుండా నివారించబడింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు.. మంటలు ఎలా ప్రారంభమయ్యాయి అనే అంశాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఏరియాలో ఈ కేఫ్ పూర్తిగా మూసివేయబడటం, కాలిపోవడం పట్ల ఆ ప్రాంత ప్రజలు, స్థానికులు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అగ్నిమాపక శాఖ విచారణ తర్వాత తెలుస్తాయని అధికారులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: ఈ పొడి ఒక్క చెంచా తాగితే చాలు.. 85% రోగాలు పరార్.. తప్పక తెలుసుకోండి!
Follow Us