Fake RMPs : రాష్ట్రంలో నకిలీ ఆర్ఎంపీలు... 15 మంది పై మెడికల్ కౌన్సిల్ కేసులు
గ్రామాల్లో జ్వరం, ఒళ్లునొప్పులు, వ్యాధి ఏదైనా ముందుగా వెళ్లేది దగ్గర్లోని ఆర్ఎంపీ వద్దకే. రోగాలను నయం చేస్తారనే భరోసాతో వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నారు. తాజాగా నకిలీ డిగ్రీలతో చికిత్స చేస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ కొరడా ఝలిపించింది.