Jewellery: అయ్యో పాపం.. కళ్లముందే వరదల్లో కొట్టుకుపోయిన రూ.12 కోట్ల బంగారం

గత కొన్నిరోజుల నుంచి చైనాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. . అయితే షాంగ్జీ ప్రావిన్స్‌లో వరదల ప్రభావం వల్ల ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ నగల దుకాణంలో నుంచి బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయి. వాటి విలువ దాదాపు రూ.12 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.

New Update
Gold rush in China: Locals hunt for jewellery worth 12 crores swept away in flood

Gold rush in China: Locals hunt for jewellery worth 12 crores swept away in flood

 గత కొన్నిరోజుల నుంచి చైనాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. అయితే షాంగ్జీ ప్రావిన్స్‌లో వరదల ప్రభావం వల్ల ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ నగల దుకాణంలో నుంచి బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకుపోవడం కలకలం రేపింది. వాటి విలువ దాదాపు రూ.12 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. దీంతో వాటి కోసం వీధుల్లో ఉండే స్థానికులు పోటీపడ్డారు. బంగారం కోసం గంటల తరబడి వాళ్లు వెతుకుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Also Read :  ‘పేదల బైక్’.. లీటర్‌కు 70 కి.మీ మైలేజ్ - ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు సామీ!

జులై 25న షాంగ్జీ ప్రావిన్స్‌లోని వుచి కౌంటీలో భారీ వరదల వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. సముద్రతీరానికి దగ్గర్లోనే ఈ ప్రాంతం ఉంది. లావోఫెంగ్జియాంగ్ అనే జువెల్లరీ షాప్ నుంచే ఆభరణాలు కొట్టుకుపోయాయి. ఆ రోజున ఎప్పట్లాగే ఆభరణాల దుకాణాన్ని తెరిచి ఉంచారు. కానీ భారీ వర్షాల వల్ల ఆ ప్రాంతం నీటమునిగింది. ఈ క్రమంలోనే వరద షాప్‌లోకి వచ్చింది. వరద ఉద్ధృతి పెరగడం వల్ల సిబ్బంది కళ్లముందే ఆభరణాలు కొట్టుకుపోయాయి. అది చూసిన సిబ్బంది షాకైపోయారు. 

వరదల్లో కొట్టుకుపోయిన ఆభరణాల్లో బంగారు హారాలు, ఉంగరాలు, చెవి దుద్దులు, గాజులతో పాటు వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని దుకాణ యజమాని మీడియాకు చెబుతూ ఆవేదన చెందారు. అంతేకాదు సేఫ్‌ బాక్సులో రీసైకిల్ చేసిన బంగారం, అలాగే భారీగా నగదు ఉన్నాయని.. అది కూడా వరదల్లో కొట్టుకుపోయిందని వాపోయారు. మొత్తంగా తన షాపులో నుంచి 20 కిలోల బంగారం, నగదు కొట్టుకుపోయినట్లు చెప్పారు. దీనివిలువ 10 మిలియన్ల యువాన్లు ( మన కరెన్సీలో రూ.12 కోట్లు పైగానే ) ఉన్నట్లు పేర్కొన్నారు.  

Also Read: 10 నిమిషాల్లో లక్షల కోట్ల నష్టం.. ట్రంప్‌ టారిఫ్‌‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్!

మరోవైపు బంగారం వరదల్లో కొట్టుకుపోయినట్లు అక్కడి స్థానికులకు తెలిసింది. దీంతో వారు వీధుల్లో ఆభరణాలు వెతికేందుక ఎగబడ్డారు. అయితే కొంతమంది తమకు దొరికిన ఆభరణాలు వెనక్కి ఇచ్చేసినట్లు ఆ దుకాణ యజమాని చెప్పారు. ఇప్పటిదాకా కేవలం కిలో బంగారం మాత్రమే తనకు చేరినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన జరిగి కొన్ని రోజులు గడిచినా కూడా స్థానికులు బంగారం కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ ప్రభావానికి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 80,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

Advertisment
తాజా కథనాలు