Ration Card : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్!?
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల కోడ్ ముగియగానే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. పేద, మధ్య తరగతి బాధలను తీర్చేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు.