ED: ఐఏఎస్ అమోయ్‌కుమార్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధం!

TG: రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూముల అక్రమ బదలాయింపు కేసులో ఐఏఎస్ అమోయ్‌కుమార్‌కు ఈడీ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసు సంబంధించిన ఆధారాలను డీజీపీకి ఇచ్చారు. అమోయ్‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని సిఫార్సు చేశారు. ఆ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా దర్యాప్తునకు యోచనలో ఈడీ ఉంది.

IAS Amoy Kumar
New Update

IAS Amoy Kumar : రంగారెడ్డి జిల్లాలో భూదాన్  భూముల అక్రమ బదలాయింపు కేసులో ఐఏఎస్ అమోయ్‌కుమార్‌కు ఈడీ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసు సంబంధించిన ఆధారాలను డీజీపీకి ఇచ్చారు. అమోయ్‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని సిఫార్సు చేశారు. ఆ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా దర్యాప్తునకు యోచనలో ఈడీ ఉంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో ఈడీ వేగం పెంచింది. పలుమార్లు ఈ కేసుకు సంబంధించి ఐఏఎస్ అమోయ్‌ కుమార్‌ను విచారించింది. అయితే ఇప్పటికే ఈ కేసులో కీలక విషయాలను ఈడీ సేకరించినట్లు తెలుస్తోంది. ఐఏఎస్ అమోయ్ కుమార్ ను అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అమోయ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని.. ఇందులో ఉన్న మిగతా వారి పాత్రపై ఆరా తీయనుంది.

Also Read :  కార్తీక మాసంలో ఇంట్లో ఈ మొక్క నాటితే.. ఐశ్వర్య సిద్ధి తధ్యం!

కేసు నమోదు చేయాలని...

గతంలో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ గా పని చేసిన అమోయ్ కుమార్ అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ నిర్దారణకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో నిన్న ఈడీ అధికారులు డీజీపీ జితేందర్ ను కలిశారు. ఈ కేసులో అమోయ్‌ కుమార్‌ పాత్రపై కూలంకషంగా విచారణ జరిపి కేసులు నమోదు చేసేలా స్థానిక పోలీసులను ఆదేశించాలని డీజీపీని కోరారు. అలాగే రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో అమోయ్‌ కుమార్‌ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో జరిగిన భూ లావాదేవీలపై బాధితుల నుంచి వచ్చిన  ఫిర్యాదులపై విచారణ జరపాలని కోరారు. పలువురు బాధితులు తమకు ఇప్పటికే చేసిన 12 ఫిర్యాదుల వివరాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. నాగారం భూదాన్‌ భూముల విషయంలో వివరాలడిగినా పోలీసులు స్పందించలేదని ఈడీ అధికారులు డీజీపీకి వెల్లడించారు. తమ దర్యాప్తులో ప్రాథమికంగా లభించిన ఆధారాలను డీజీపీకి సమర్పించారు. కాగా.. ఇలా ఈడీ అధికారులు డీజీపీని కలిసి వివరాలు సమర్పించడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు కేసు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.

Also Read :  'పుష్ప2' ఐటమ్ సాంగ్ లీక్.. శ్రీలీల, బన్నీ లుక్ మామూలుగా లేదు!

42 ఎకరాలకు వందల కోట్లు...

ఐఏఎస్ అధికారి అమోయ్‌‌ కుమార్‌‌ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు భూ కేటాయింపుల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు పలు ఫిర్యాదులు వచ్చాయి. రూ.వందల కోట్ల విలువైన 42 ఎకరాలను అక్రమంగా బదిలీ చేసినట్లు సమాచారం. కాగా భూదాన్‌‌కు చెందిన సర్వే నంబర్ 181లో 50 ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉండేది. ఈ భూమికి తమది అంటూ.. ఆ భూమికి వారసురాలిని తాను అంటూ గతంలో ఖాదురున్నీసా బేగం అనే ముస్లిం మహిళ సక్సేషన్‌‌కు దరఖాస్తు చేసుకుంది. కాగా ఈ భూమిని  2021లో ఆమె పేరున వివాదాస్పద భూమి రిజిస్టర్  చేశారు అధికారులు.

Also Read :  ట్రంప్ గెలిచారు, నేను అమెరికా నుంచి వెళ్లిపోతా..మస్క్ కుమార్తె ప్రకటన

Also Read :  తొలి టీ20లో భారత్ విజయం.. అదరగొట్టిన శాంసన్

#telangana #ed #ias #amoy kumar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe