Vivian Jenna Wilson: ట్రంప్ గెలిచారు, నేను అమెరికా నుంచి వెళ్లిపోతా..మస్క్ కుమార్తె ప్రకటన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన వేళ.. తాను అమెరికా నుంచి వెళ్లిపోతానని ఎలాన్ మస్క్ కుమార్తె పేర్కొన్నారు. ట్రంప్ విజయంతో తనకు అమెరికాలో భవిష్యత్ ఉండదని అర్థం అయిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. By Bhavana 09 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి America : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుఫున డొనాల్డ్ ట్రంప్ విజయం అందుకున్న విషయం తెలిసిందే. అయితే ట్రంప్ విజయంలో ట్విటర్, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ పాత్ర ఎంతో ఉందన్న విషయం ప్రపంచానికి తెలిసిందే. ఇదే విషయాన్ని విక్టరీ స్పీచ్‌లో స్వయంగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. Also Read: Ap Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడ్రోజులు వానలే..! ఇక డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత.. ఎలాన్ మస్క్‌కు తగిన గౌరవం, పదవి దక్కనున్నాయి అని అమెరికాలో రాజకీయ విశ్లేషకులు ఎప్పుడో చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు.. ఎన్నికలకు ముందే.. తాను గెలిస్తే మస్క్‌కు మంచి పదవి కట్టబెడతానని ట్రంప్ ఎప్పుడో చెప్పిన సంగతి తెలిసిందే. Also Read: Karthikamasam :ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు..లక్ష్మీదేవి మీ ఇంట్లోనే! అమెరికాలో భవిష్యత్ కనిపించడం లేదని... ఈ నేపథ్యంలోనే తాజాగా ఎలాన్ మస్క్ కుమార్తె వివియాన్ ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా సంచలన విషయాన్ని తెలిపారు. ట్రంప్ రాకతో తన లాంటి వారికి అమెరికాలో భవిష్యత్ కనిపించడం లేదని.. అందుకే దేశాన్ని వీడాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. Also Read: పవన్ నన్ను క్షమించండి.. ఇంకెప్పుడు అలా చేయను: శ్రీరెడ్డి మరో సంచలనం! ఎలాన్ మస్క్ కుమార్తె వివియాన్ జెన్నా విల్సన్ అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలుపుపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన థ్రెడ్స్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్ ని చేశారు. వివియాన్ జెన్నా విల్సన్ పురుషుడిగా పుట్టినప్పటికీ.. ఆ తర్వాత లింగ మార్పిడి చేసుకుని మహిళగా మారిపోయాడు. Also Read: BIG BREAKING: విడదల రజినికి జగన్ కీలక పదవి! అది ఎలాన్ మస్క్‌కు నచ్చలేదు. అయితే తాజాగా ట్రంప్ రాకతో అమెరికాలో తన లాంటి ట్రాన్స్‌జెండర్లకు భవిష్యత్తు ఉండదని ఆమె తెలిపారు. తాను దేశం విడిచి వెళ్లిపోవాలని ఎంతో కాలంగా అనుకున్నానని.. కానీ ఇప్పుడు ట్రంప్ గెలుపుతో దేశాన్ని విడిచి వెళ్లిపోవాలనే కోరిక మరింత పెరిగిందని ఆమె చెప్పుకొచ్చారు. కానీ డొనాల్డ్ ట్రంప్ 4 ఏళ్లు మాత్రమే అమెరికా అధ్యక్షుడి పదవిలో ఉంటాడని తెలుసని.. అంతేకాకుండా తాను గెలిస్తే లింగమార్పిడి నిబంధనలను అమలు చేస్తానని గతంలో ట్రంప్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే అవన్నీ ఇప్పటికిప్పుడు అమలు కావని కూడా తనకు తెలుసన్నారు. ట్రంప్ మాత్రమే అమెరికా అధ్యక్షుడు కావాలని.. అతడిని పిచ్చిగా అభిమానించి ఓట్లు వేసిన అమెరికా ప్రజలు ఎప్పటికీ ఇదే సమాజంలో ఉంటారని వివియాన్ జెన్నా విల్సన్ తెలిపారు. అయితే సమీప భవిష్యత్తులో ట్రాన్స్ జెండర్లపై అమెరికా ప్రజల మనస్తత్వంలో మార్పు వచ్చే అవకాశమే లేదని తేలిపోయిందని పేర్కొన్నారు. దీనివల్ల ట్రాన్స్ జెండర్లకు అమెరికాలో భవిష్యత్తు లేదనే స్పష్టత వచ్చిందని చెప్పుకొచ్చారు. #elon-musk #donald-trump #vivian-jenna-wilson మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి