/rtv/media/media_files/2025/08/25/rave-party-disrupted-in-gachibowli-2025-08-25-19-26-06.jpg)
. Rave Party Disrupted in Gachibowli
Rave Party : పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినప్పటికీ డ్రగ్స్ దందాను అరికట్టలేకపోతున్నారు. దీంతో డ్రగ్స్‌వాడకం దారులు రెచ్చిపోతున్నారు. తాజాగా గచ్చిబౌలిలో రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. రేవ్ పార్టీపై దాడి ఘటనలో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మాదాపూర్ డీసీపీ వినీత్ దీనికి సంబంధించి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
Also Read: గణేశ్ మండపాన్ని పెడుతున్నారా ? ఈ రూల్స్ తప్పకుండా పాటించాల్సిందే
కొండాపూర్‌లోని రాజేశ్వరి నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గచ్చిబౌలి పోలీసులతో పాటు ఈగల్ టీమ్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. ఈ రైడ్‌లో 20 గ్రాముల కొకైన్, 3 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల డ్రగ్ పిల్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్ట్ అయిన వారిలో డ్రగ్ ఫెడ్లర్లు తేజ, విక్రమ్ తోపాటు, ముగ్గురు వినియోగదారులు నీలిమ, పురుషోత్తం, భార్గవ్ ఉన్నారు. ట్రాన్స్‌పోర్టర్ చందన్ కూడా వీరిలో ఉన్నారని అని డీసీపీ చెప్పారు. వీరిలో తేజ, విక్రమ్ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారన్నారు. నీలిమ, పురుషోత్తంరెడ్డి, భార్గవ్ హైదరాబాద్‌కు చెందినవారు. చందన్, రాహుల్ బెంగళూరుకు చెందినవారిగా పోలీసులు వివరించారు. ఈ కేసులో బెంగళూరుకు చెందిన రాహుల్, మణిదీప్ ఇద్దరు పరారీలో ఉన్నారని డీసీపీ అన్నారు. వీరిద్దరూ డ్రగ్స్ సరఫరా చేసినట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి:లవర్తో కలిసి మొగుణ్ని లేపేసింది బండరాయితో.. హైదరాబాద్లో మరో దారుణం!
'విక్రమ్, తేజ, నీలిమ డ్రగ్స్ ప్రొక్యూర్ చేసి గోవా, రాజమండ్రిలలో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారన్నారు. తేజ న్యూ ఇయర్ సందర్భంగా గోవాలో ఒక రేవ్ పార్టీ ఏర్పాటు చేశారన్నారు. అందులో నీలిమ కూడా ఉన్నారని తెలిపారు. పట్టుబడ్డ నిందితులు ప్రతిసారీ రేవ్ పార్టీ నిర్వహించిన సందర్భంలో రాహుల్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసేవారన్నారు. ఈ కేసులో పట్టుబడ్డ డ్రగ్ ఫెడ్లర్ విక్రమ్.. మల్నాడు రెస్టారెంట్ సూర్యకు స్నేహితుడు.' అని డీసీపీ వివరించారు.
ఈ కేసులో పట్టుబడ్డ మరో నిందితుడు మణిదీప్ డిప్యూటీ తహసిల్దార్ గా పని చేస్తున్నాడన్నారు. మణిదీప్ రాజమండ్రిలో ఉంటూ, రాజమండ్రితో పాటు గోవాలో కూడా పార్టీలు అరెంజ్ చేస్తాడని వివరించాడు. రాజమండ్రిలో మణిదీప్‌కు సొంత ఫాంహౌస్ ఉంది. అక్కడ కూడా రేవు పార్టీలు ఏర్పాటు చేశాడని వివరించాడు. అలా నీలిమకు, తేజకు మణిదీప్ డ్రగ్స్ అలవాటు చేసినట్లు తెలిపారు. విక్రమ్, నీలిమ ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారన్నారు. తేజకు క్లౌడ్ కిచెన్ బిజినెస్ ఉందని, బిజినెస్‌లో లాభాలు రాకపోవడంతో రేవ్ పార్టీ అరేంజ్ చేస్తున్నారని వివరించారు. బెంగళూరుకు చెందిన రాహుల్ కు నైజీరియన్ మైక్ డ్రగ్స్ సప్లయ్ చేసినట్లు తేలిందన్నారు. తేజా డబ్బులు ఇస్తే చందన్ డ్రగ్స్ తీసుకు వస్తాడు. బ్లూటో థియాన్ ఇంజెక్షన్ మాటున ఈ డ్రగ్స్ తీసుకు వచ్చినట్లు.' డీసీపీ వివరించారు.
ఇది కూడా చదవండి:అయ్యోపాపం.. డబ్బుల కోసం రిటైర్డ్ డీఎస్పీని కట్టేసి కొట్టిన భార్యపిల్లలు..వీడియో వైరల్