హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు (HMWSSB) కీలక ప్రకటన చేసింది. జనవరి 11న ఉదయం 6 గంటల నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. 24 గంటల పాటు ఈ అంతరాయం కొనసాగుతుందని పేర్కొంది. ఆ సమయంలో హియాయత్ సాగర్ రిజర్వాయర్ ఫోర్బే, మిరాలమ్ ఫిల్టర్ బెడ్స్, సెట్లింగ్ ట్యాంక్స్ అలాగే ఇన్‌లెట్ ఛానెల్స్‌ను శుభ్రపరిచే పనులు జరుగుతాయని స్పష్టం చేసింది.
Also Read: తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్.. మందుబాబులకు బిగ్ షాక్!
ఈ పనుల కొనసాగడం వల్ల నగరంలోని చాలా ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు పూర్తిగా అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్ల పాక్షికంగా అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. జనవరి ఉదయం 6 గంటల నుంచి జనవరి 12 ఉదయం 6 గంటల వరకు పారిశుద్ధ్య పనులు జరుగుతాయని చెప్పింది. నగరవాసులు తమకు సహకరించాలని కోరింది.
Also read: బాలయ్య హీరోయిన్ కు వేధింపులు.. 27మందిపై కేసు, పోలీసుల అదుపులో వ్యాపార వేత్త
ముఖ్యంగా హుస్సేన్ సాగర్, కిషన్ బాగ్, దూబ్ బౌలి, మిస్రిగంజ్, పత్తెర్‌గట్టి, దర్-ఉల్-షిఫా, మోఘల్పురా, జహనుమ, చందులాల్ బరాదరి, ఫలక్‌నుమా, జంగంపేట్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడునుంది. అయితే ఈ ప్రాంతాల్లో ఉండేవారు నీటిని పొదుపుగా వాడుకోవాలని HMWSSB సూచించింది.
Also Read: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి అలర్ట్.. పోలీసుల కీలక సూచనలు!
Also Read: అలా చేయడం లైంగిక వేధింపుతో సమానం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు