Delhi: ఢిల్లీలో నీటి సంక్షోభం.. అల్లాడిపోతున్న నగర ప్రజలు
యమునా నదికి ప్రవాహం తగ్గడంతో ఢిల్లీ ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. మరోవైపు నీటి సరఫరా వ్యవస్థను ధ్వంసం చేసేందుకు దుండగులు ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ సర్కార్ గుర్తించింది. ఈ నేపథ్యంలో పైప్‌లైన్ల్ వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసింది.