Divorce cases: కోర్టుల్లో పెరిగిన విడాకుల పిటిషన్లు.. ప్రతి 6 వందల్లో 4 మాత్రమే!

దేశంలో విడాకుల కేసులు పెరుగుతున్నాయని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ చెప్పారు. చాలామంది డివోర్స్ పిటిషన్లతోనే కోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రతి 600 కుటుంబాల్లో కేవలం 4 ఫ్యామిలీల్లోనే డివోర్స్ కేసులు లేవన్నారు.  

New Update
divorce

divorce Photograph: (divorce)

Justice Sujoy Paul: దేశంలో విడాకుల కేసులు ఊహించని రీతిలో పెరుగుతున్నాయని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ చెప్పారు. ఈ మధ్య కాలంలో చాలామంది డివోర్స్ పిటిషన్లతోనే కోర్టును ఆశ్రయిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు సోమవారం వరంగల్‌లో కమ్యూనిటీ మీడియేషన్‌ సమావేశానికి హాజరైన ఆయన.. ఈ అంశం ఆందోళన కలిగిస్తోందన్నారు. అంతేకాదు ఆ మీటింగ్ లోనే బంధువులు, సన్నిహితుల్లో విడాకుల కేసులు లేని వారు చెయ్యి ఎత్తాలని కోరారు. దీంతో 600 మంది వాలంటీర్లలో కేవలం 4గురు మాత్రమే చెయ్యి ఎత్తడం గమనార్హం. కాగా ప్రస్తుత పరిస్థితులకు తాను చెబుతున్నదానికి అద్దం పడుతున్నట్లు రుజువు చేశారు. 

కమ్యూనిటీ సెంటర్ల ఏర్పాటు..

అయితే ఈ విడాకుల కేసులను వర్గాల వారీగా కమ్యూనిటీ సెంటర్లను ఏర్పాటు చేసి రాజీమార్గంలో పరిష్కరించవచ్చని సూచించారు. ఈ విధానం ఇప్పటికే కేరళలో ప్రారంభమైనట్లు చెప్పారు. విడాకుల కేసుల్లో ఉన్నత స్థానంలో ఉన్నవారు, పలువురు అధికారులు సైతం ఉన్నట్లు తెలిపారు.  నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సెంటర్‌ లో 142 కేసులకు 72, కామారెడ్డిలో 20కి 9 కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు. ఈ సెంటర్లలో విడాకుల సమస్యలు, పరిష్కారంపై 3 రోజులు మనోవిజ్ఞాన వేత్తలు, నిపుణులు శిక్షణ ఇస్తారు. వాటిని అందరూ ఆచరించాలన్నారు. 

ఇది కూడా చదవండి: BREAKING: అర్చకులు రంగరాజన్‌కు సీఎం రేవంత్ ఫోన్.. పోలీసులకు కీలక ఆదేశాలు!

ఈ సందర్భంగా మరో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ మాట్లాడుతూ.. ఇందౌర్‌లో 22 కమ్యూనిటీ సెంటర్లు ఏర్పాటు చేయడంతో కోర్టు బయటే 5 వేలకు పైగా కేసులకు పరిష్కారం దొరికిందన్నారు. ఈ సెంటర్లలో వ్యాపారులు, విలేకరులు, విద్యావేత్తలు, విశ్రాంత ఉన్నతాధికారులు స్వచ్ఛందంగా భాగస్వాములు అవుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లోనూ సెంటర్లలో పనిచేసేందుకు ముందుకొచ్చిన వాలంటీర్లకు వారు అభినందనలు తెలిపారు. 

ఇది కూడా చదవండి: Suma Kanakala: ఎమ్మెల్యే కూతురితో లవ్ లో పడ్డ సుమ కొడుకు.. ఎవరో తెలిస్తే షాకే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు