/rtv/media/media_files/2025/02/10/bWk9gdNgAb96iTdpeVE1.jpg)
ROSHAN KANAKALA
Suma kanakala: సోషల్ మీడియాలో సెలెబ్రెటీలకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ నిత్యం వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా వారి పెళ్లి, రిలేషన్ షిప్ గురించిన వార్తలు మరింత హల్ చల్ చేస్తుంటాయి. వారికి తెలియకుండానే వారి ప్రేమ, పెళ్లి అన్నీ సోషల్ మీడియాలోనే జరిగిపోతాయి. అయితే తాజాగా మరో యంగ్ హీరో పెళ్లి వార్త తెరపైకి వచ్చింది.
Also Read: Allu Aravind: బన్నీ డ్యాన్స్ చిరంజీవి నుంచి వచ్చింది కాదు.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్!
ఎమ్మెల్యే కూతురితో సుమ కొడుకు పెళ్లి
ఇటీవలే బబుల్‌గమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన స్టార్ యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ పెళ్లికి సంబంధించిన వార్త నెట్టింట నెట్టింట వైరల్ గా మారింది. రోషన్ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని. దీంతో రెండు ఫ్యామిలీలు వీరిద్దరికీ పెళ్లి చేయాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే రోషన్ లేదా సుమా క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
/rtv/media/media_files/2025/02/10/mLTaaos8mpyYbjohmsKR.jpg)
ప్రస్తుతం రోషన్ తన సెకండ్ ఫిల్మ్ 'మోగ్లీ' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. 'కలర్ ఫోటో' ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, గ్లిమ్ప్స్ భిన్నంగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లోనూ నటించాడు రోషన్. డిస్నీ హాట్ స్టార్ లో విడుదలైన 'మోక్ష ఐలాండ్' ఓ కీలక పాత్ర పోషించాడు.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ ఎవరి అభిమానో తెలుసా.. సక్సెస్ మీట్లో బన్నీ సంచలన స్టేట్మెంట్!