/rtv/media/media_files/2025/07/27/gandikota-inter-student-incident-2025-07-27-15-52-11.jpg)
Gandikota Inter Student Incident
కడప జిల్లాలోని గండికోటలో ఇంటర్ విద్యార్థిని (
Also Read: ఆడుకుంటుండగా బిందెలో ఇరుక్కున్న చిన్నారి తల....ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Gandikota Inter Student Incident
ఒక దశలో అమ్మాయి కుటుంబ సభ్యుల ప్రమేయంపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రేమ వ్యవహారం కారణంగా కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై కూడా పోలీసులు స్పష్టమైన ఆధారాలను బయటపెట్టలేదు. ఈ హత్య జరిగి దాదాపు 14 రోజులు దాటినా పోలీసులు ఇంకా ఈ కేసును చేధించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. పామునే కొరికి చంపేశాడు
రాజకీయ జోక్యంతోనే విచారణకు బ్రేక్ పడిందనే అనుమానాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మొదట కీలక క్లూ దొరికిందని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత అన్నలే చంపారంటూ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు ఒక్క ఆధారం కూడా దొరకలేదని పోలీసులు చెబుతున్నట్లు సమాచారం. దీంతో ఒక్క క్లూ లేకుండా చంపడం సాధ్యమేనా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: రుద్ర బ్రిగేడ్లు, భైరవ్ బెటాలియన్లతో భారత సైన్యం పటిష్టం..ఆందోళనలో పాక్, చైనా
ఇక ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో, పోలీసులు ప్రధానంగా సాంకేతిక ఆధారాలపై ఆధారపడుతున్నట్లు సమాచారం. హత్య జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో యాక్టివ్‌గా ఉన్న మొబైల్ ఫోన్‌లను విశ్లేషిస్తున్నారు. సుమారు 350 మంది మొబైల్ వినియోగదారులను గుర్తించి, వారిలో 69 మంది అనుమానితులను షార్ట్‌లిస్ట్ చేశారు. అనంతరం దర్యాప్తు పూర్తిగా సాంకేతిక ఆధారాల ద్వారా జరుగుతుందని, రాజకీయ ఒత్తిళ్లు లేవని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
Also Read: హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట, ఆరుగురు భక్తులు మృతి
Latest crime news | telugu-news | Gandikota Girl | Gandikota Girl Incident | gandikota girl news