రాష్ట్రంలో త్వరలో కొత్త విద్యుత్ విధానం: భట్టి విక్రమార్క

పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనలో ఉద్యోగులకు సరైన టైమ్‌లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని భట్టి విక్రమార్క అన్నారు. సంక్షేమ పథకాలకు తమ ప్రభుత్వం రూ.61 వేల కోట్లు వెచ్చించిందని తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో కొత్త విద్యుత్ విధానాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు.

New Update
Batti

బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనలో ఉద్యోగులకు సరైన టైమ్‌లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని అన్నారు. సంక్షేమ పథకాలకు తమ ప్రభుత్వం రూ.61 వేల కోట్లు వెచ్చించిందని తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. '' బీఆర్‌ఎస్‌ రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.52 వేల కోట్లు అప్పు చేశాం.

Also Read: ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. రైతులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగం

అప్పులను బ్యాంకులకు తిరిగి కట్టే పరిస్థితి తీసుకొచ్చారు. వీటికి అదనపు ఆదాయం కలిపి బ్యాంకులకు కట్టే పరిస్థితి వచ్చింది. సంక్షేమ పథకాల కోసం రూ.61 వేల కోట్లు ఖర్చు చేశాం. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, చేయుతా, ఆరోగ్య శ్రీ పథకాలకు నిధులు అందించాం. ప్రతిరోజూ అడ్డగోలుగా ఏదో ఒకటి మాట్లడటమే బీఆర్‌ఎస్‌ నేతలు పనిగా పెట్టుకున్నారు. త్వరలోనే రాష్ట్రంలో కొత్త విద్యుత్ విధానాన్ని ప్రకటిస్తాం.    

Also Read: వడ్డీ రేట్లు యథాతథమే..ఎలాంటి మార్పులు లేవు:ఆర్బీఐ గవర్నర్‌!

అందరూ వద్దని చెప్పినా కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టును కట్టింది. కేంద్ర ప్రభుత్వం చేసిన ఆలస్యం వల్ల భద్రాద్రి ప్రాజెక్టుపై 42 శాతం అదనపు భారం పెరిగింది. ప్రాజెక్టు కోసం పెరిగే ధరలన్నీ కూడా చివరికీ ప్రజలపై భారం వేశారు. విద్యుత్ రంగం గురించి బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేశారు. మీరు చేసిన తప్పులను మేము తిప్పికొట్టాం.  

Also read: ఈ ఆలయానికి కేజీ బంగారం, రూ.23 కోట్ల విరాళాలు.. ఇంకా లెక్కుంది

విద్యుత్‌ విషయానికి సంబంధించి సమగ్ర వివరాలను అందించాం. గతేడాదికంటే విద్యుత్‌ డిమాండ్‌ పెరిగినా కూడా క్వాలిటీగా విద్యుత్‌ను ఇస్తున్నాం. విద్యుత్ సరఫరాలో వచ్చిన ఇబ్బందులను గుర్తించాం. ఉత్పత్తి కేంద్రాల సమాచారం గురించి ప్రజలకు వివరించాం. థర్మల్ ఎనర్జీ వల్ల కాలుష్యం దారుణంగా పెరుగుతోందని'' భట్టి విక్రమార్క అన్నారు.  

Also Read: ఉత్తరప్రదేశ్ లో ఘోరం.. జన్మనిచ్చిన కాసేపటికే లిఫ్ట్ కుప్పకూలి..

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు