/rtv/media/media_files/2024/12/06/YUQMwDbJgdnJEXWSkQsR.jpg)
uttarpradesh incident
uttarpradesh: ఉత్తప్రదేశ్ రాష్ట్రంలోని మేరఠ్‌లో ప్రాంతంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. మేరఠ్ కి చెందిన కరిష్మా అనే మహిళ 9 నెలల గర్భవతి. అయితే ఆమెకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న క్యాపిటల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కాగా, శుక్రవారం తెల్లవారుజామున కరిష్మా ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తన బిడ్డను తొలి చూపు కూడా చూడకుండానే కన్నుమూసింది ఆ కన్న తల్లి.
Also Read: ఓవర్సీస్‌లో పుష్ప 2 వైల్డ్ ఫైర్.. రప్పా రప్పా లాడించిన బన్నీ
బిడ్డను చూడకుండానే..
అయితే డెలివరీ అనంతరం కరిష్మాను పై అంతస్థు నుంచి లిఫ్ట్ లో గ్రౌండ్ ఫ్లోర్ వార్డ్ కి తీసుకొస్తుండగా అకస్మాత్తుగా లిఫ్ట్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో కరిష్మా తల, మెడకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడే మృతి చెందింది. అలాగే ఆమెతో పాటు ఉన్న ఇద్దరు ఆస్పత్రి సిబ్బంది గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన 45 నిమిషాల తర్వాత సిబ్బంది లిఫ్ట్ డోర్ పగలగొట్టి క్షతగాత్రులను బయటకు తీశారు.
Also Read: శ్రీవల్లి, పుష్ప రాజ్ షూటింగ్ ఫొటోస్.. రష్మిక పోస్ట్ వైరల్!
ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణం..
లిఫ్ట్ కుప్పకూలిన తర్వాత ఆస్పత్రి సిబ్బంది అలసత్వంగా వ్యవహరించడం వల్లే తన భార్యను కోల్పోయానని కరిష్మా భర్త, కుటుంబసభ్యులు వాపోయారు. సరైన సమయంలో చికిత్స అందకపోవడమే కరిష్మా మృతికి కారణమని ఆరోపిస్తున్నారు. బిడ్డ ఆమెతో కాకుండా వేరే వార్డులో ఉండడంతో క్షేమంగా ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు ఆస్పత్రి పై దాడి చేయడంతో సిబ్బంది అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఓవర్ లోడ్ కారణంగానే లిఫ్ట్ కుప్పకూలినట్లు ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కటారియా తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఘటనకు కారణం ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Also Read : 'పుష్ప2' జాతర ఎపిసోడ్.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మురిసిపోయిన బన్నీ, వీడియో వైరల్