రాజస్థాన్‌లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న తన భార్యను చూసుకునేందుకు ఓ భర్త ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ(VRS) చేశాడు. ఇకనుంచి దగ్గరుండి ఆమె బాబోగులు చూసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలోనే పదవీ విరమణ సందర్భంగా ఓ ఫంక్షన్ కూడా ఏర్పాటు చేశాడు. కానీ ఈ వేడుకలోనే అతని భార్య మృతి చెందడం కలకలం రేపింది. రిటైర్మెంట్ తీసుకున్న సందర్భంగా ఇలాంటి విషాదం జరగడం అందరినీ కలచివేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. Also Read: అక్రమ సంబంధాల్లో మహిళలే టాప్.. ఇండియాలో ఆ రాష్ట్రమే నెం.1 ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని కోటాకు చెందిన దేవేంద్ర సందాల్ అనే వ్యక్తి కేంద్ర గిడ్డంగుల విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. అతని భార్య దీపిక గృహిణి. అయితే కొంతకాలంగా ఆమె గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతోంది. వాళ్లకి సంతానం కూడా లేదు. దీంతో భార్య బాగోగులు చూసుకోవాలని దేవేంద్ర భావించాడు. ఇందుకోసం మూడేళ్ల ముందుగానే తన ఉద్యోగాని స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు. ఆ తర్వాత రిటైర్మెంట్ ఫంక్షన్‌ను కూడా తన ఆఫీసులోనే నిర్వహించాడు. ఈ వేడుకకు తన భార్య దీపికను కూడా తీసుకెళ్లాడు. Also Read: పార్లమెంట్ దగ్గర నిప్పంటించుకున్న వ్యక్తి..పరిస్థితి విషమం ఈ కార్యక్రమంలో ఉద్యోగులు దేవేంద్ర, తన భార్యను కుర్చీలో కూర్చోబెట్టారు. వాళ్లని పూల మాలలతో సత్కరిస్తున్నారు. అక్కడున్న వాళ్లందరూ ఫొటోలు కూడా దిగుతున్నారు. ఇలా సరదాగా వేడుక సాగుతున్న సమయంలోనే దీపిక కూర్చీలో నుంచి ఒక్కసారిగా వెనక్కి పడిపోయారు. దీంతో అందరూ షాకైపోయారు. ఆమెను పట్టుకొని పైకి లేపారు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. వీఆర్ఎస్ తీసుకొని భార్య బాగోగులు చూసుకుందామనకున్న దేవేంద్రకు ఇలాంటి పరిస్థితి రావడం అందర్నీ కంటనీరు పెట్టిస్తోంది. Also Read: యూపీలో దారుణం..పుట్టినరోజని పిలిచి బట్టలిప్పించి..మూత్రం తాగించారు