UP: యూపీలో దారుణం..పుట్టినరోజని పిలిచి బట్టలిప్పించి..మూత్రం తాగించారు

యూపీలో దారుణ ఘటన జరిగింది. పదో తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలుడి పట్ల అతడి స్నేహితులు దారుణంగా ప్రవర్తించారు.పుట్టిన రోజు వేడుకలని పిలిచి బట్టలు విప్పించి , మూత్రం తాగించారు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

New Update
యువకుడి ఆత్మహత్యాయత్నం.. పోలీసుల వేధింపులే కారణమా?

Up: యూపీలో దారుణ ఘటన జరిగింది. పదో తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలుడి పట్ల అతడి స్నేహితులు దారుణంగా ప్రవర్తించారు. స్నేహితుడి పుట్టిన రోజు ఉంది రమ్మని పిలిచి అతడిని ఘోరంగా అవమానించారు. ముందుగా ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లి మరీ అతడితో బట్టలు విప్పించారు. ఆపై ముగ్గురు అబ్బాయిలు, ఓ అమ్మాయి కలిసి అతడిని విపరీతంగా కొట్టారు. అది చాలదన్నట్లుగా అబ్బాయిలు మూత్ర విసర్జన చేశారు. దీన్ని అమ్మాయి వీడియో తీసింది. ఇంతటితో ఆగకుండా ఉమ్ము, మూత్రం కలిపి  అతడితో బలవంతంగా తాగించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read: Pakistan: అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వరుస వైమానిక దాడులు..!

పోలీసులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తర ప్రదేశ్‌లోని కప్టైన్‌గంజ్ సమీపంలో ఉన్న బస్తీలో ఆశతో పాటు ఆమె భర్త, కుమారుడు నివాసం ఉంటున్నారు. వీరికి  17 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో అతడు పదో తరగతి చదువుతున్నాడు. అయితే డిసెంబర్ 20వ తేదీ రోజు రాత్రి వినయ్ కుమార్ అనే బాలుడు తన స్నేహితురాలి పుట్టిన రోజుకు రావాలంటూ సదరు బాలుడికి ఫోన్ చేశాడు. దీంతో బాలుడు వస్తానని చెప్పాడు. చెప్పినట్లుగానే సాయంత్రం వారి ఇంటికి వెళ్లాడు.

Also Read: Ap Rains: అంచనాలకు భిన్నంగా కదులుతున్న అల్పపీడనం..!

అక్కడ పుట్టిన రోజు చేసుకునే అమ్మాయితో పాటు మరో ముగ్గురు స్నేహితులు కూడా అక్కడ ఉన్నారు. వారంతా బాలుడికి తెలిసిన వాళ్లే. అయితే అతడు వారి ఇంటికి వెళ్లిన వెంటనే.. అతడిని ఇంటి వెనకాల ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లారు. ఆపై అతడిని బట్టలు విప్పమని బలవంతం పెట్టారు. ఆపై నలుగురూ కలిసి విపరీతంగా కొట్టారు. అది చాలదన్నట్లుగా అతడిపై మూత్ర విసర్జన కూడా చేశారు. ఇంతటితో ఆగకుండా ఉమ్ము, మూత్రాన్ని అతడితో బలవంతంగా తాగించారు. దీన్నంతటినీ ఫోన్‌లో రికార్డు చేశారు. కానీ బాలుడు వారి కాళ్లావేళ్లా పడగా డిలీట్ చేసేశారు. ఆపై అతడిని వదిలేసి వాళ్లు ఇంట్లోకి వెళ్లిపోయారు.

Also Read: Vajpayee: వాజ్‌పేయ్‌ శతజయంతి ఉత్సవాలు..ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం!

స్నేహితులు ఘోరంగా అవమానించడంతో.. తీవ్ర మనస్తాపానికి చెందిన బాలుడు ఏడుస్తూనే ఇంటికి వెళ్లాడు. ఆపై పడుకుంటానని చెప్పి వెళ్లి కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. ఉదయం వరకూ కూడా బాలుడు అలాగే ఉండేసరికి తల్లిదండ్రులు ఏమైందని అడగ్గా.. జరిగిన విషయాన్ని వివరించాడు.   దీంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ వారి ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదు. ఇలా మూడు రోజులు తిరిగినప్పటికీ  లాభం లేకపోయింది. దీంతో బాలుడు మరింత కలత చెందాడు. తీవ్ర మనస్తాపానికి గురైన బాలుడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read: PV Sindhu: వేడుకగా పీవీ సింధు వెడ్డింగ్‌ రిసెప్షన్‌...హాజరైన ప్రముఖులు వీరే!

కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో  తల్లిదండ్రులు మరోసారి పోలీసు స్టేషన్‌కు వెళ్లి అతనిస్నేహితులపై ఫిర్యాదు చేశారు. బాలుడు ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. అతడితో అసభ్యంగా ప్రవర్తించి, అమానుషంగా అవమానించిన నలుగురు విద్యార్థులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆపై ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో బాలుడు పారిపోయాడాని కానీ త్వరలోనే అతడిని కూడా పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు