సుజాత లేని గేమ్ ఛేంజర్.. ఎవరీ రంగరాజన్ .. శంకర్ పని అయిపోయనట్టేనా!

భారీ అంచనాలతో రిలీజైన గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్సుడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో రైటర్ సుజాత రంగరాజన్ పేరు ఇప్పుడు బాగా వినిపిస్తుంది. అసలు ఎవరీ రంగరాజన్. పూర్తి కథనం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Shankar and sujatha

Shankar and sujatha Photograph: (Shankar and sujatha)

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ  గేమ్ ఛేంజర్. భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్సుడ్ టాక్ సొంతం చేసుకుంది.  శంకర్ మార్క్ మూవీ ఇది కాదంటూ ఆడియన్స్ అంటున్నారు.  ఈ క్రమంలో ఒకతని పేరు ఇప్పుడు బాగా వినిపిస్తుంది. ఆయనే  సుజాత రంగరాజన్. ఈయన అసలు పేరు రంగరాజన్  మాత్రమే ..  సూజాత అనేది ఆయన  భార్య పేరు...  సుజాత రంగరాజన్ పేరుతోనే ఆయన బాగా ఫేమస్ అయ్యారు.  ఇంతకీ ఇతను ఎవరు.. శంకర్ కు ఈయనకు ఏంటీ  సంబంధం?  

సుజాత రంగరాజన్ నవలా రచయిత,  స్క్రీన్ రైటర్, పది రంగస్థల నాటకాలు రాశారు.  అనేక తమిళ చిత్రాలకు స్క్రీన్‌ప్లే , డైలాగ్‌లు కూడా రాశారు.  1935లో తమిళనాడులో పుట్టిన రంగరాజన్..  ఓ సైంటిస్ట్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో పనిచేశారు.   ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ( EVM ) తయారీలో ఈయన పాత్ర చాలా కీలకం. ఇండస్ట్రీకి వచ్చాక గ్రేట్ డైరెక్టర్ మణిరత్నంతో కలిసి పనిచేశారు.  రోజా,అమృత,దొంగ దొంగ,యువ సినిమాలకు ఈయన  డైలాగ్స్ రాశారు.  

శంకర్ సినిమాలకు బ్యాక్ బోన్

జెంటిల్ మెన్  సినిమా కథ రాసుకున్న శంకర్ ముందుగా సుజాత రంగరాజన్ ను కలిశారు.  కథను వినిపించారు. కథ మొత్తం విన్న  రంగరాజన్  హీరో ఎందుకోసం దొంగతనాలు చేస్తాడు అని శంకర్ ను ప్రశ్నించారట. ఆ తరువాత ఇందులో ఓ సామాజిక అంశాన్ని జోడించారట శంకర్. ఇక అప్పటినుంచి వీరిద్దరి ప్రయాణం మొదలైంది. శంకర్ అన్ని సినిమాలకు రంగరాజన్  బ్యాక్ బోన్ గా నిలిచారు. రోబో సినిమా వరకు ఇద్దరు కలిసి పనిచేశారు.  రోబో మూవీ మేకింగ్ టైమ్ లోనే 2008న  రంగరాజన్ అనారోగ్య సమస్యలతో  కన్నుమూశారు.  

ఆ తరువాత శంకర్ తీసిన సినిమాల్లో రంగరాజన్  లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. రోబో తరువాత శంకర్ సినిమాలు ఆడలేదని చెప్పాలి. స్నేహితుడు, ఐ, రోబో 2, భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ సినిమాలు శంకర్ మార్క్ ను బీట్ చేయలేకపోయాయి.  శంకర్ గ్రేట్ డైరెక్టర్.. అందులో నో డౌట్. కానీ  రంగరాజన్ లాంటి రైటర్స్ ఆయన పక్కన లేకపోవడమే వల్లే శంకర్ రూట్ తప్పారని  చెప్పాలి.  ఇండియన్ 2 ప్రెస్ మీట్ లో కూడా డైరెక్టర్ శంకర్ తాను  రంగరాజన్  ను బాగా మిస్ అవుతున్నట్లు చెప్పుకొచ్చారు.  మరి ఇండియన్ 03తో అయిన శంకర్ మెప్పిస్తాడో లేదో చూడాలి.  

Also Read :  బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే!

Advertisment
తాజా కథనాలు