Supreme Court: ప్రభుత్వ సొమ్ము ప్రజల కోసమా ? సైకిల్ ట్రాక్‌ల కోసమా ?.. సుప్రీంకోర్టు ఆగ్రహం

ప్రభుత్వ సొమ్ముతో దేశంలో సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వ ఖజానాను పేదల కోసం వినియోగించాలా? లేదా సైకిల్ ట్రాక్‌లు వేసేందుకు ఉపయోగించాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

New Update
Supreme Court

Supreme Court

ప్రభుత్వ సొమ్ముతో దేశమంతా సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని ఓ వ్యక్తి ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషినర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఖజానాను పేదలకు ఇళ్లు, ఆరోగ్యం, విద్యా ఇతర సౌకర్యాల కోసం వినియోగించాలా? లేదా సైకిల్ ట్రాక్‌లు వేసేందుకు ఉపయోగించాలా అంటూ ప్రశ్నించింది. ఇప్పటికీ అనేక నగరాల్లో పేద ప్రజలకు సరైన నివాసాలు లేక మురికి వాడల్లో నివసిస్తున్నారని చెప్పింది. వాళ్లకి సరైన ఆరోగ్య, విద్యా సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేసింది. 

Also Read: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపరాఫర్.. 40 వేల ఉద్యోగాలు!

దేశ ప్రజల సమస్యల గురించి కాకుండా సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని కోర్టుకు ఆశ్రయించినందుకు ఆయనకు చురకలంటించింది. అలాగే పిటిషినర్ తరఫున న్యాయవాది కూడా మాట్లాడారు. ఎంపిక చేసినటువంటి నగరాలు, పట్టణాల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టిసారించే అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్‌ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ పథకం గురించి ప్రస్తావించారు. ఈ స్కీమ్ కింద చాలా రాష్ట్రాల్లో సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేశారని చెప్పారు.   

Also Read: జనవరి 16న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌కు అంతరాయం.. !

చలికాలంలో మంచు, వాయు కాలుష్యం వల్ల ఢిల్లీలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఒకవేళ సైకిల్ ట్రాక్‌లు నిర్మిస్తే వాటిని ఈ ప్రమాదాలను నివారించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. దీనిపై స్పందించిన కోర్టు.. పిటిషనర్ కోరిన విధంగా ప్రభుత్వాలు చేస్తాయని అనుకోవడం అతడి పగటి కలే అవుతుందని పేర్కొంది. చివరికి పటిషన్‌ను కొట్టివేసింది.  

Also Read: పెద్ద చదువులు చదివి సన్యాసం.. కుంభమేళలో IIT బాబా వైరల్

Also Read: సుప్రీంకోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

Advertisment
తాజా కథనాలు