Warangal: కాంగ్రెస్ నేత లైంగిక వేధింపులు..పురుగుల మందు తాగిన ప్రభుత్వ ఉద్యోగిని..
అధికార పార్టీ నాయకుడి లైంగిక వేధింపులు తట్టుకోలేక ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది. అతడితో పాటు తన పై అధికారి అయిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని.. ఆఫీసులోనే పురుగుల మందు తాగింది. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటుచేసుకుంది.