/rtv/media/media_files/2025/01/31/4DKapLfnxkLLrbu1pKJg.jpg)
Mali Mine
పశ్చిమాఫ్రికాలోని మాలి దేశంలో దారుణం చోటుచేసుకుంది. ఓ బంగారు గనిలోని కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ విషాద ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కౌలికోరో ప్రాంతాలో ఉన్న బంగారు గనిలో తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే బుధవారం అక్కడ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడ్డాయి.
Also Read: వీడి దుంపతెగ.. రీల్స్ కోసం రూ.10 లక్షల కారును ఏం చేశాడో చూడండి!
ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. చనిపోయిన వాళ్లలో ఎక్కువమంది మహిళలే ఉననరు. గనిలోకి బురదనీరు ప్రవేశించింది వాళ్లను చుట్టుముట్టింది. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి రెస్క్యూ టీం చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని అక్కడి గవర్నర్ వెల్లడించారు. ఈ విషాద ఘటనలో మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని.. గల్లంతైన వారి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లుపేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోందని తెలిపారు.
Also Read: ఏపీ యువతిని ముంబైలో రేప్ చేసి చంపిన యువకుడు.. నిర్దోషిగా విడుదల చేసిన సుప్రీంకోర్టు!
ఇదిలాఉండగా ఆఫ్రికాలో మూడో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారుగా మాలి ఉంది. అయితే ఇలాంటి ప్రమాదాలు అక్కడ సాధారణంగా మారిపోయాయి. 2024లో కూడా ఇదే ప్రాంతంలోని కంగబా అనే జిల్లాలో బంగారు గని కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో ఏకంగా 70 మంది మృతి చెందారు. అయితే వర్కర్లు ఎలాంటి భద్రత చర్యలు లేకుండానే అక్రమ మైనింగ్‌కు పాల్పడటంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
Also Read: వీసా గడువు ముగిసినా అమెరికాలో.. మరింత కఠినంగా నిబంధనలు, భారతీయులపై తీవ్ర ప్రభావం!
Also Read: ట్రాఫిక్ కంట్రోల్ టవర్ లో సిబ్బంది కొరత...వాషింగ్టన్ ప్రమాదానికి కారణం ఇదే..