/rtv/media/media_files/2025/04/22/AUUWUbCaeMneYCNTxduS.jpg)
CM Revanth welcomes foreign companies to invest in Hyderabad
TG News: తెలంగాణలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విదేశీ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టి ఉత్పత్తులు తయారు చేయాలని కోరారు. జపాన్ పర్యటనలో భాగంగా తమ ప్రభుత్వం స్థిరమైన, సులభతర పారిశ్రామిక విధానాలను అనుసరిస్తోందని తెలిపారు. ఈ మేరకు భారత మార్కెట్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోవాలన్నారు. 'తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. నవ ప్రపంచాన్ని నిర్మిద్దాం' అని పిలపునిచ్చారు.
Also Read : ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే?
ఏకైక రాష్ట్రం మనదే..
జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి టీమ్.. ఒసాకాలో జరిగిన ‘వరల్డ్ ఎక్స్‌పో’లో పాల్గొంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్..‘ఒసాకాలో జరుగుతున్న ‘వరల్డ్ ఎక్స్‌పో’లో పాలుపంచుకున్న దేశంలోని మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. తెలంగాణ, జపాన్‌ల మధ్య మంచి సంబంధాలున్నాయి. ఒసాకా బేలో సూర్యోదయం లాంటి కొత్త అధ్యాయం తెలంగాణలో ప్రారంభమవుతోంది. తెలంగాణతో పాటు ఒసాకా, ప్రపంచంతో కలిసి అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దాం. ఈ రిలేషన్ దీర్ఘకాల భాగస్వామ్యంగా మార్చుకుందాం. కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు కలిసి పనిచేద్దాం’ అని అన్నారు.
ఇది కూడా చూడండి: Holiday Culture: హాలీడే కల్చర్ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్ల
ఇక ఐటీ, బయో టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సాధించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్ రంగాల పరిశ్రమలకు తెలంగాణలో అనుకూల వాతావరణం ఉందన్నారు. హైదరాబాద్ సమీపంలో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నమని, ఎకో, ఎనర్జీ, స్మార్ట్ మొబిలిటీ, సర్క్యులర్ ఎకానమీపై ఈ సిటీ ఆధారపడుతుందని తెలిపారు. జపాన్ మారుబెని కార్పొరేషన్‌తో ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నాం. అర్బన్ గ్రీన్ వేని అభివృద్ధి చేసేందుకు టోక్యో, ఒసాకా నగరాలను చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు.
ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..
Also Read : మరోసారి వింటేజ్ కాంబో.. బాలయ్య సినిమాలో విజయశాంతి
cm revanth | japan | telugu-news | today telugu news
Follow Us