Akhanda 2 Update: రాజకీయాలతో కొంతకాలం సినిమాలకు దూరమైనా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇటీవలే 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమాతో అలరించిన విజయశాంతి.. ఇంతలోనే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అఖండ 2 లో విజయశాంతి
బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ 2 లో విజయశాంతి కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాల్లో టాక్. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
Lady Amitabh in #AkhandaThaandavam:#Vijayashanti in #NandamuriBalakrishna- Akhanda Thaandavam
— MOHIT_R.C (@Mohit_RC_91) April 20, 2025
Reports are coming out that senior actor Vijayashanti will be playing an important & powerful role in the film.
If this turns out to be true,it will be a pure delight to all the fans pic.twitter.com/U2ExKinMyw
ఇదిలా ఉంటే 'అఖండ 2: తాండవం' చిత్రీకరణ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ లోనే సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, VFX పనులు ఆలస్యమవుతుండడంతో వచ్చే ఏడాది 2026 సంక్రాంతికి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ అయితే విషయంపై ఇంకా అధికారిక ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
telugu-news | cinema-news | latest-news | vijayashanthi