/rtv/media/media_files/2025/09/06/young-man-murdered-minor-dispute-friends-stabbed-him-to-death-in-saharanpur-2025-09-06-15-49-31.jpg)
young man murdered minor dispute friends stabbed him to death in saharanpur
స్నేహం కోసం ప్రాణాలిచ్చే ఫ్రెండ్స్‌ని చూసుంటాం. అలాగే స్నేహితుడు కష్టాల్లో ఉంటే.. వారిని ఆదుకునే గొప్ప స్నేహితులను చూసుంటాం. కానీ ఎన్నో ఏళ్లు కలిసి తిరిగి.. కష్టం, సుఖం, ఆనందంలో పాలుపంచుకున్న స్నేహితులే.. తోటి స్నేహితుడిని కత్తులతో పొడిచి పొడిచి చంపడం ఎంతో బాధ కలిగించే విషయం. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. స్నేహితులంతా కలిసి జాతరను చూడ్డానికి వెళ్లారు. అక్కడ చిన్న గొడవ మొదలవడంతో.. తోటి స్నేహితుడిని కత్తులతో పొడిచి హత్య చేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు కొందరిని అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
young man murdered in up
యూపీలోని సహరాన్‌పూర్ జిల్లా రాంపూర్ మణిహరన్ ప్రాంతంలోని మల్హిపూర్ గ్రామంలో ఈ విషాదకరమైన ఘటన జరిగింది. కన్వర్ సైన్ అనే యువకుడు జాతరను సందర్శించడానికి వెళ్లాడు. అక్కడ అతడి ముగ్గురు స్నేహితులతో చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త పెద్దదిగా మారింది. దీంతో ఆ ముగ్గురు స్నేహితులు కలిసి తోటి స్నేహితుడిని అత్యంత దారుణంగా హత్య చేశారు.
కన్వర్ సైన్‌తో మద్యం మత్తులో ఉన్న తన స్నేహితులు వాగ్వాదానికి దిగారని స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత వారు కన్వర్‌పై కత్తులతో దాడి చేసి హత్య చేశారని అంటున్నారు. సంఘటన తర్వాత మృతుడి సోదరుడు సునీల్ కుమార్ రాంపూర్ మణిహరన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 5న పోలీసులు విజయం సాధించారు. నిందితులు ముగ్గురిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరొక నిందితుడు పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుల పేర్లను పోలీసులు వెల్లడించారు. వారిని సుహైల్, సుశాంత్ బర్మన్‌గా గుర్తించారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, రెండు మొబైల్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం వారిని విచారించగా.. సంచలన విషయాలు వెల్లడించారు. అరెస్టయిన నిందితులు ఆగస్టు 26 రాత్రి ఒక జాతర చూడటానికి వెళ్లినట్లు అంగీకరించారు. అక్కడ మద్యం సేవించిన తర్వాత గొడవ జరిగి.. కోపంతో ముగ్గురూ కలిసి కన్వర్ సేన్‌పై కత్తితో దాడి చేసినట్లు అంగీకరించారు. దీని తర్వాత వారు అక్కడ నుంచి పారిపోయినట్లు తెలిపారు.