/rtv/media/media_files/2025/08/10/cm-revanth-reddy-surprise-visit-to-hyderabad-2025-08-10-17-28-16.jpg)
CM Revanth Reddy's surprise visit to Hyderabad
CM Revanth Reddy : హైదరాబాద్ నగరం అకాల వర్షాలతో నగరం అతలాకుతలం అయ్యాయి. పలు కాలనీలు ఇప్పటికీ నీటమునిగే ఉన్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ముంపునకు గురైన పలు ప్రాంతాలను పరిశీలించారు.మైత్రివనం, బల్కంపేట్, అమీర్‌పేట్ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అధికారులను అడిగి వాటి పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలని సూచించారు. ముఖ్యంగా అమీర్‌పేట్‌లోని గంగుబాయి బస్తీ, బల్కంపేట్‌లోని ముంపు ప్రభావిత కాలనీల్లో ప్రజల పరిస్థితి, నష్టాలను రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు.
ఇది కూడా చూడండి:Shrishti Fertility Center: సృష్టి కేసులో ఈడీ రంగ ప్రవేశం.. భారీగా నిధులు తరలింపుపై అనుమానాలు
వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం తడిచి ముద్దయ్యింది. నగరంలో కుండపోత వానలు కురిసి, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ముఖ్యంగా మూసీ నది, హుస్సేన్ సాగర్ నాలాల పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా బస్తీల్లో పర్యటించిన రేవంత్ స్థానికులతో మాట్లాడారు. కాగా లోతట్టు ప్రాంతాల్లో, బస్తీల్లో రోడ్లపై నీరు నిలిచి ఉండటంపై అధికారులను ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతాల్లో వెంటనే చర్యలు చేపట్టాలని అదేశాలు జారీ చేశారు.
బుద్ధనగర్ లో డ్రైన్ సిస్టంను పరిశీలించిన ముఖ్యమంత్రి అధికారులకు తగు సూచనలు చేశారు.కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండటంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతోందని సీఎం పేర్కొన్నారు. వెంటనే డ్రైనేజీ సిస్టంను స్ట్రీమ్ లైన్ చేసి, వరద నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని అధికారులకు సూచించారు.పక్కనే ఉన్న గంగూబాయి బస్తీ కుంటను కొంతమంది పూడ్చి వేసి పార్కింగ్ కు వినియోగిస్తున్నారని సీఎంకు స్థానికులు పిర్యాదు చేశారు.గంగూబాయి కుంట ప్రాంతాన్ని సందర్శించి అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు.ఒక ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.ఇటీవల వరద నీరు నిలిచిపోయిన మైత్రీవనం వద్ద పరిస్థితిని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఇది కూడా చూడండి: IAF: ఆరు పాకిస్థాన్ యుద్ధ విమానాలు కూల్చేశాం.. IAF చీఫ్ సంచలన వ్యాఖ్యలు
జీహెచ్‌ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ.. ఎక్కడా నీరు నిలిచిపోకుండా, వర్షపు నీరు ఇళ్లలోకి చేరకుండా చర్యలు చేపట్టాలని హైడ్రా కమిషనర్ కు సూచించారు. బల్కంపేటలో, గంగూబాయి బస్తీలో స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకొని, వాటిని పరిష్కరించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ముంపు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలతో సీఎం రేవంత్ స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం హైడ్రా కమిషనర్, ఇతర అధికారులను వెంటబెట్టుకొని పర్యటించిన సీఎం, వరదనీటి ప్రవాహం, డ్రైనేజీ వ్యవస్థ, సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసు కున్నారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని మోహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటి మునిగిన రహదారులు, ఇళ్లలోకి ప్రవేశించిన వరదనీటిని వెంటనే తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు. ఈ పర్యటనలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు కూడా సీఎం వెంట ఉన్నారు. హైదరాబాద్‌లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని అధికారులు వెల్లడించారు.మరోవైపు నగరంలో మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్షా నిర్వహించారు. హైడ్రా అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద చర్యలు తీసుకొని, నీరు నిలిచిపోకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చూడండి:Palnadu Ragging: పల్నాడు లో ర్యాగింగ్ కలకలం.. కర్రలతో కొడుతూ.. కరెంట్ షాక్ పెడుతూ! వీడియో వైరల్