/rtv/media/media_files/2025/08/08/lover-2025-08-08-09-21-02.jpg)
TG Crime : ప్రేమ పేరుతో వేధించడంతో పాటు ఆమెను శారీరకంగా హింసించి లైంగికదాడికి పాల్పడ్డాడో పైశాచిక ప్రేమికుడు. ప్రేమించిన పాపానికి చేతి గోర్లు కత్తిరించడమే కాకుండా కత్తెరతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అంతేకాదు విషయం ఎవరికన్న చెబితే యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ అమానుష ఘటన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన ఓ యువతి ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చింది. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులతో సగంలోనే కోర్సును ఆపేసింది. అనంతరం ల్యాంకోహిల్స్ వద్ద ఓ ప్రైవేట్ సంస్థలో టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌గా చేరింది. సోమాజిగూడలోని కపాడియా లైన్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో స్నేహితులతో కలిసి ఓ ఫ్లాట్‌లో నివసిస్తుంది. ఇదిలా ఉండగా ఆమె పనిచేసే సంస్థలోనే విధులు నిర్వహించే బీఎన్ రెడ్డి నగర్ పరిధిలోని చైతన్యనగర్‌కు చెందిన ఎ.భానుప్రకాష్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అతను వివాహం చేసుకుంటానని నమ్మించి సదరు యువతితో కలిసి తిరిగాడు.
ఇలా ఉంటున్న సమయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో భానుప్రసాద్ సైకోగా మారాడు. బాధితురాలిని తరచూ వేధించడం, కొట్టడం, బెదిరించడం చేస్తుండే వాడని పోలీసులు తెలిపారు. ఈ నెల 26వ తేదీన రాత్రి 2:30కి బాధితురాలు ఉండే ఫ్లాట్‌కి వచ్చాడు. ఆమె రూమ్ మేట్స్‌ను బెదిరించి..గదిలో వారిని బంధించాడు. అనంతరం యువతిపై బలవంతంగా లైంగిక దాడి చేశాడు. అంతే కాకుండా ఆమెపై కత్తెరతో దాడి చేశారు. మధ్య వేలు గోర్లు కత్తిరించాడు. పోలీసులకు, ఇతరులు ఎవరికైనా చెబితే యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరించాడు.దీంతో బాధితురాలు తీవ్ర భయాందోళనకు గురైంది..మరుసటి రోజు స్నేహితులతో కలిసి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు భానుప్రకాష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also Read: Abhishek Bachchan: అభిషేక్ అవార్డులు కొనుక్కుంటారు.. ట్రోలర్స్ కి హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Follow Us