స్కూళ్లు బంద్‌పెట్టి టీచర్ల దావత్..ప్రభుత్వ అధికారులు సైతం హాజరు

హైదరాబాద్‌లోని షేక్‌పేట మండల పరిధిలోని 20 ప్రైమరీ స్కూళ్లను టీచర్లు బంద్‌పెట్టారు. ఇటీవల కొత్తగా స్కూళ్లకు వచ్చిన ఎస్జీటీలు, సీనియర్​ ఎస్జీటీలు అంతా కలిసి లంచ్‌పార్టీ చేసుకున్నారు. ఈ విందుకు ఎస్టీటీలతోపాటు మండలంలోని 7 హైస్కూళ్ల హెచ్ఎంలు సైతం హాజరైయ్యారు.

New Update
lanchi party

TG news

TG news: ఈ మధ్యకాలంలో టీచర్ల నిర్వాకం ఏదో ఒకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. పిల్లలకు క్రమశిక్షణ, విద్యా నేర్చాల్సిన ఉపాద్యాయులే ఇష్టా రీతిన వ్యవహరిస్తున్నా రు. తాజాగా స్కూల్‌ బంద్‌పెట్టి పార్టీ చేసుకుంటున్న టీచర్ల నిర్వాకం వెలుగుకి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్‌లో కలకలకం రేపింది.

స్కూళ్లు బంద్ పెట్టి లంచ్ పార్టీలు:

ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇటీవల కొత్తగా స్కూళ్లకు వచ్చిన ఎస్జీటీలు, సీనియర్ ఎస్జీటీలు వచ్చిన విషయం తెలిసిందే.  వారంతా కలిసి బంజారాహిల్స్‌లోని గతి స్కూల్‌లో పార్టీ చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే షేక్‌పేట మండలంలోని టీచర్లు అందరూ క్లాసులు బంద్ పెట్టారు. వీరంతా ఒకచోట చేరుకుని లంచ్ పార్టీ చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ  ప్రైమరీ స్కూళ్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు ఉంటుంది. పార్టీ చేసుకోవాలని ముందుగానే ఫ్లాన్‌ చేసుకున్న టీచర్లు షేక్‌పేట మండల పరిధిలో ఉన్న 20 ప్రైమరీ స్కూళ్లను మధ్యాహ్నం ఒంటి గంటకే  పిల్లను ఇంటి పంపిచి స్కూల్‌ని క్లోజ్ చేశారు.

ఇది కూడా చదవండి: రేవంత్‌-అల్లు అర్జున్‌ పబ్లిసిటీ స్టంట్‌.. కేంద్రమంత్రి షాకింగ్‌ కామెంట్‌

తరువాత అక్కడ అంతా కలిసి లంచ్‌ పార్టీ చేసుకునేందుకు వెళ్లారు. ఈ విందుకు ఎస్జీటీలతోపాటు మండలంలోని 7 హైస్కూళ్ల హెచ్ఎంలు కూడా హాజరైయ్యారు. స్కూళ్లు బంద్‌పెట్టి టీచర్లు లంచ్‌ పార్టీ చేసుకోవడంపై పలువురు తీవ్ర విమర్శలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  టీచర్లకు ఏమైనా పర్సనల్ పార్టీలు, విందులు చేసుకోవాలంటే సెలవు రోజుల్లో చేసుకోవాలని హితవు పలుకుతున్నారు. దీనిపై పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ పార్టీ షేక్‌పేట మండల డిప్యూటీ ఐఓఎస్ అనుమతితో జరగడం వలన మరి కొందరు మండి పడ్డుతున్నారు. దీనిపై విద్యశాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: బ్యాంక్ గోడకు కన్నం.. కనిపెట్టిన కాంట్రాక్టు ఉద్యోగి

ఇది కూడా చదవండి: 90 ఏళ్ల బామ్మకు డిగ్రీ పట్టా..యువతకు ఆదర్శంగా రాబర్ట్ జర్నీ

ఇది కూడా చదవండి:  బ్యాంక్ గోడకు కన్నం.. కనిపెట్టిన కాంట్రాక్టు ఉద్యోగి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు