చిన్న పిల్లలు ఆడుతున్నప్పుడు కొన్ని ప్రమాదాలు జరగడం సాధారణమే. కొన్నిసార్లు పిల్లలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉంటాయి. ఇలానే ఓ తల్లి ఊయలతో పిల్లలను ఆడిస్తూ.. తన ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బెల్లంపల్లి టైన్‌లో నీరజ అనే మహిళ నివస్తోంది. ఈమెకు నవ్య, ధనుష్, సుచిత్ర అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిని ఊయలతో ఆడేంచేందుకు చీరతో ఇంట్లో కట్టింది. ఇది కూడా చూడండి: ఈ రాత్రికి చంచల్‌గూడ జైల్లోనే అల్లు అర్జున్..! ప్రమాదవశాత్తు ఊయల మెడకు చుట్టుకుని.. ఇలా ఓ రోజు ఊయలతో ఆడిస్తుండగా.. ప్రమాదవశాత్తు ఆ ఉయ్యాల ఆమె మెడకు చుట్టుకుంది. కళ్ల ఎదుటే తల్లి మెడకు ఊయల చుట్టుకోవడంతో పిల్లలు ఏడ్చారు. వారి ఏడుపు విని అత్త వచ్చే సరికి నీరజ మృతి చెందింది. కళ్ల ముందే తల్లి మరణించడంతో ముగ్గురు పిల్లలు ఏడుస్తున్నారు. నీరజ మృతితో కుటుంబం శోక సంద్రంలోకి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇది కూడా చూడండి: BIG BREAKING: జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ కొడుకు తల్లిని చంపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. స్కూల్‌కు వెళ్లేందుకు ఆలస్యం అవుతుందని తల్లి కొడుకుని నిద్ర లేపితే దారుణానికి ఒడిగట్టాడు. ఆ కొడుకుని తల్లి లేపడంతో కోపంతో ఆమె తలను బలంగా నేలకోసి కొట్టాడు. దీంతో తలకు గాయం అయ్యి ఆ తల్లి మరణించింది. ఇది కూడా చూడండి: Kavya Kalyanram: ఆహా.. పిచ్చెక్కించే "బలగం" బ్యూటీ అందాలు.. ఆమె భర్త చెన్నైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో సైంటిస్ట్‌గా చేస్తున్నారు. అతను ఎన్నిసార్లు కాల్ చేసిన కూడా రెస్పాండ్ లేదు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్లే కొడుకు తల్లిని చంపినట్లు తండ్రి తెలిపారు. తల్లిని చంపిన తర్వాత ఇంటికి తాళం వేసి నాలుగు రోజుల పాటు శవంతోనే ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇది కూడా చూడండి: Ap : మరో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన