రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్ చేస్తే ఇంటి వద్దకే..!

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఫోన్ చేస్తే ఇంటి వద్దకే వరి విత్తనాలు అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. యాసంగి సీజన్‌లో 2.5 లక్షల ఎకరాలకు సరిపడా 50 వేల క్వింటాళ్ల నాణ్యమైన వరి విత్తనాలు సరఫరా చేయాలనే లక్ష్యం పెట్టుకుంది.

New Update
paddy

Seeds Delivery: తెలంగాణ ప్రభుత్వం రైతులు చేదోడుగా ఉండేందుకు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఫోన్ లో యాప్ ద్వారా ఆర్డర్ పెడితే ఇంటి వద్దకే ఆహారం వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే తరహాలో వ్యవసాయ రంగంలో కూడా అమలు చేసేలా కార్యాచరణ చేపట్టింది ప్రభుత్వం. ఒక ఫోన్ కాల్ తో ఇంటి వద్దకే వరి విత్తనాలను సరఫరా చేసేందుకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సన్నాహాలు చేస్తోంది. యాసంగి పంట వస్తున్న క్రమంలో మొత్తం 2.5 లక్షల ఎకరాలకు సరిపడా 50 వేల క్వింటాళ్ల నాణ్యమైన వరి విత్తనాలు సరఫరా చేయాలని విత్తనాభివృద్ధి సంస్థ టార్గెట్ పెట్టుకుంది. వివిధ మార్గాల ద్వారా వరి విత్తనాలను రైతుల దగ్గరకు చేరవేసేందుకు వ్యూహాలు రచిస్తోంది.

ఇది కూడా చదవండి: రాజకీయాలు బ్రేక్.. కేటీఆర్ సంచలన నిర్ణయం!

ఈ రకాల విత్తనాలకు గిరాకీ ఎక్కువ..!

ఇది కూడా చదవండి: రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు!

వర్ష కాలంతో పోలిస్తే యాసంగి పంట మంచిగా వస్తుంది. వరి కూడా రోగాల భారిన పడకుండా ఉంటుంది. వర్ష కాలం పంట రైతులకు భరోసా ఇవ్వకపోయినా.. యాసంగి పంట మాత్రం రైతులకు నష్టం వాటిల్లకుండా చేస్తుంది. అయితే ఈ సీజన్ రైతులకు ఎక్కువ లాభం తెచ్చే వరి విత్తనాలను రైతులకు ఇంటి వద్దకే, సరసమైన ధరలకే అందించే దిశగా రాష్ట్ర వ్యవసాయ శాఖ అడుగులు వేస్తోంది. 

ఇది కూడా చదవండి: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఈరోజు 3 లక్షల మందికి రుణమాఫీ !

ఇందుకోసం యాసంగి సీజన్ లో రైతుల నుంచి గిరాకీ ఎక్కువగా ఉన్న తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌- 15048), కూనారం సన్నాలు (కేఎన్‌ఎం- 163), జగిత్యాల సన్నాలు (జేజీఎల్‌- 27356)తోపాటు.. దొడ్డు రకాలైన కేఎన్‌ఎం- 118, జేజీఎల్‌- 4423, ఎంటీయూ- 1010, ఆర్‌ఎన్‌ఆర్‌- 29325  ఇలా మొత్తం ఏడు రకాల వరి విత్తనాలను సరఫరా చేయనున్నారు. బహిరంగ మార్కెట్లో 10 కిలోల విత్తన బస్తా రూ.900 ఉండగా.. విత్తనాభివృద్ధి సంస్థ 15 కిలోల బస్తాకు రూ.700, 25 కిలోల బస్తాకు రూ.995 చొప్పున ధరకే రైతులకు ఈ విత్తనాలను అందించనున్నారు.

ఇది కూడా చదవండి: ప్లీజ్ నాన్న మమ్మల్ని చంపొద్దు.. కాళ్లు పట్టుకున్నా కనికరించని తండ్రి

Advertisment
Advertisment
తాజా కథనాలు