Rythu Runamafi: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఈరోజు 3 లక్షల మందికి రుణమాఫీ !

నాలుగో విడుతలో మూడు లక్షల మంది రైతులకు రూ.3000 కోట్లను శనివారం విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహబూబ్‌నగర్‌లో ఈరోజు నిర్వహించనున్న రైతు పండుగలో సీఎం రేవంత్‌ దీనికి సంబంధించిన ప్రకటన చేయనున్నారు.

New Update
farmerss

తెలంగాణలో ఇంకా చాలామందికి రుణమాఫీ జరగలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే నాలుగో విడుతలో మూడు లక్షల మంది రైతులకు రూ.3000 కోట్లను శనివారం విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా శనివారం మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తున్న రైతు పండుగను ముగించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు ముఖ్య అతిథిగా రానున్న సీఎం రేవంత్‌.. వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక ప్రకటనలు చేయనున్నారు. రుణమాఫీ అంశాన్ని కూడా సీఎం రేవంత్ వెల్లడించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.  

Also Read: కుమురంభీంలో విషాదం.. పులి పంజాకు యువతి బలి

ఇక వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్‌లో రైతుపండుగ ప్రారంభమైంది. వ్యవసాయం, ఉద్యానవనం, పశువైద్య, పాడి, మత్స్య రంగాలకు చెందిన స్టాళ్లను ఏర్పాటుచేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పంటలు, వ్యవసాయ పద్ధతులు, యంత్రాలు, పురుగుమందులు, ఎరువులు, ప్రకృతి సేద్యం మొదలగు తదితర అంశాలను అధికారులు, శాస్త్రవేత్తలు.. రైతులకు వివరిస్తున్నారు. పంటల సాగుపై డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు గురు, శుక్రవారాల్లో రైతులు భారీగా హాజరయ్యారు. 

సభకు లక్ష మందికి పైగా

శనివారం సాయంత్రం వరకు ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులోనే సీఎం రేవంత్ పాల్గొననున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించి రైతులతో మాట్లాడుతారు. ఆ తర్వాత జరిగే సభలో ప్రసంగిస్తారు. ఈ సభకు అన్ని జిల్లాల నుంచి లక్ష మందికి పైగా రైతులను సమీకరించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రులందరూ కూడా సభకు రానున్నారు. అయితే రూ.2 లక్షల పంట రుణాల మాఫీ పథకం కింద ఇప్పటిదాకా 22,22,067 మంది రైతులకు రూ.17,869.22 కోట్లు మాఫీ అయ్యాయి.  

Also Read: దామగుండం అడవిలో అగ్నిప్రమాదం.. అధికారులా పనేనా !

మొదటి విడుతలో జులై 18న రూ.6034.97 కోట్లతో 11,34,412 మంది రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ జరిగింది. రెండో విడుతలో రూ.6190.01 కోట్లతో 6,40,823 మందికి రూ.1.50 లక్షల వరకు, ఇక మూడో విడుతలో ఆగస్టు 15న రూ.5644.24 కోట్లతో రూ.2 లక్షల వరకు మాఫీ అయ్యాయి. బ్యాంకు ఖాతాలు, ఆధార్‌ కార్డుల్లో తప్పలు, రేషన్‌కార్డులు లేకపోవడం, ఇతర టెక్నికల్ సమస్యల వల్ల మూడు లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదని వ్యవసాయ అధికారులు సర్వేలో గుర్తించారు. వీళ్లందరికీ మాఫీ జరగాలంటే రూ.3 వేల కోట్లు అవసరమని నివేదిక ఇచ్చారు. ఈ మేరకే ఆర్థికశాఖ ఈ నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ ప్రకటన చేసిన వెంటనే రైతులకు రుణమాఫీ జరగనుంది.  

Also Read:  కుమురంభీంలో విషాదం.. పులి పంజాకు యువతి బలి

Also Read: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడిక్కడే మృతి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు