Lagacharla: భూసేకరణ కోసం కొత్త నోటిఫికేషన్! TG: మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటులో భాగంగా భూసేకరణకు మరో నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. లగచర్లతో పాటు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లి గ్రామంలో 71 ఎకరాల 39 గుంటల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. By V.J Reddy 30 Nov 2024 in తెలంగాణ మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి Lagacharla: రేవంత్ సర్కార్ మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. లగచర్లలో భూసేకరణ కోసం కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కాగా గతంలో లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కొరకు ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ను నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. లగచర్లలో ప్రజా అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్ పై దాడి, ఫార్మా కంపెనీ ఏర్పాటు తమకు వద్దు అని స్థానిక రైతుల ఆందోళన.. భూమి ఇవ్వమంటూ చేపట్టిన ఆందోళనల దృష్ట్యా రేవంత్ సర్కార్ ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గింది. తాజాగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం లగచర్లలోతో పాటు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లి గ్రామంలో 71 ఎకరాల 39 గుంటల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. 2013 చట్ట సెక్షన్ 6(2) కింద భూసేకరణ నోటిఫికేషన్ ను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. Also Read: రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు నోటిఫికేషన్ లో ఇలా... భూసేకరణ పునరుపాధి, పునరావాస కల్పనకు పారదర్శకత, హేతుబద్ధమైన పరిహారాన్ని పొందే హక్కు (తెలంగాణ సవరణ) చట్టము, 2016 (చట్టము నెం. 21 /2017) ద్వారా సవరించబడిన భూసేకరణ పునరుపాధి, పునరావాస కల్పనలో పారదర్శకత, హేతుబద్ధమైన పరిహారాన్ని పొందే హక్కు చట్టము 2013 సెక్షన్ 11 (1), 10ఎ మినహాయింపు అనుసరించి (రూల్ 6 /12 చూడుము). Also Read: తిరుమంగై ఆళ్వార్ విగ్రహం ఇండియాకు వచ్చేస్తోంది... ఈ దిగువ నిర్దిష్టపరచిన వికారాబాద్ జిల్లా లోని దుద్యాల్ మండలం పోలెపల్లి గ్రామము విస్తీర్ణం 71-39 ఎకరములు ప్రజాప్రయోజనం నిమిత్తం అనగా బహుళార్థ సాధక పారిశ్రామిక వాడ ఏర్పాటు కొరకు ఈ దిగువ చూపిన భూమి అవసరమైయున్నదని భావించినందున సెక్షన్ 6 (2) క్రింద (చట్టం 30/2013) లో పేర్కొనిన ప్రకారం టి.జి.ఐ.ఐ.సి. సామాజిక ప్రభావం అధ్యయన నివేదిక అవసరం లేనందున అనుబంధంలో పేర్కొనిన భూములకై నోటీసు జారీ చేయడమైనది. కావున వికారాబాద్ జిల్లాలో దుద్యాల్ మండలం పోలెపల్లి గ్రామము విస్తీర్ణం 71-39 ఎకరములు గల భూమి వివరములు ఈ క్రింద చూపిన వానిని భూసేకరణ పనుల ప్రారంభ సమిత్తం ప్రాథమిక ప్రకటన జారి చేయడమైనది. Also Read: భారత్‌తో కంగారు రెండో మ్యాచ్.. పింక్ బాల్‌కు వేదిక కానున్న అడిలైడ్ Also Read: పంజా విసురుతున్న చలి.. రోజుకు 30-40 న్యూమోనియా కేసులు #telangana #Land acquisition #lagacharla #cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి